Gossipsహిట్ కొట్టిన ఈ హీరోని ఆ డైరెక్టర్లు పట్టించుకోవడంలేదే..Why..??

హిట్ కొట్టిన ఈ హీరోని ఆ డైరెక్టర్లు పట్టించుకోవడంలేదే..Why..??

ఈ రంగుల ప్రపంచం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. అలా మారిన పేరే.. నవీన్ పోలిశెట్టి. ఒక్కప్పుడు ఈ పేరు చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఒక్క సినిమా .. ఒక్కే ఒక్క సినిమా తరువాత ఈయన బాగా పాపులర్ అయ్యిపోయాడు. అదే “జాతి రత్నాలు”.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో నవీన్ పర్ ఫామెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలైన నెలలు గడుస్తున్న నవీన్ కు పెద్ద ఆఫర్లు రాకపోవడం గమనార్హం. గత కొద్ది రోజులుగా హీరోయిన్ అనుష్క, నవీన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లుగా టాక్ నడిచింది. అయితే ఆ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో మధ్యలోనే ప్రాజెక్ట్‏కు బ్రేక్ పడిందని.. అనుష్క ఈ మూవీ చేసేందుకు నో చెప్పిందని ఫిల్మ్ సర్కిల్లో గాసిప్స్ వినిపించాయి.

అదే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఏ హీరోకైనా..ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు..ప్రోడ్యూసర్ల నుండి ఫోన్ కాల్స్ తో..బడా ఆఫర్లతో నవీన్ పేరు మారుమ్రొగిపోవాలి. కానీ ఇక్కడ పరిస్ధితి వేరేలా ఉంది. సూపర్ డూపర్ హిట్ అందుకున్న తరువాత నవీన్ కి చిన్న చితకా ఆఫర్లు వస్తున్నాయే కానీ చెప్పుకోదగిన ఆఫర్లు రావడంలేదు.. దీనికి కారణం ఏమైయుంటుందని..ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. కావలేనే పెద్ద పెద్ద హీరోలు నవీన్ కి ఆఫర్లు రాకుండా చేస్తున్నారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news