Moviesదేవర కంటే ముందే ఆ పని చేయబోతున్న కొరటాల శివ.....

దేవర కంటే ముందే ఆ పని చేయబోతున్న కొరటాల శివ.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!

కొరటాల శివ .. తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ . ఆచార్య సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా అపజయం అంటే ఎరుగని డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అప్పటినుంచి ఆయన టైం అస్సలు బాగాలేదు . ఇద్దరు బడా స్టార్స్ ని పెట్టి తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ అవడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఆ సినిమాలో నటించిన నటీనటులు పరోక్షంగా సినిమా ఫ్లాప్ కి కారణం కొరటాల డైరెక్షన్ అంటూ పలు ఈవెంట్స్ చెప్పుకు రావడం మరింత వైరల్ గా మారింది .

తాజాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో కొరటాల శివకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొరటాల శివ ప్రజెంట్ దేవర అనే సినిమానీ తెర కెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు . జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించబోతుంది. కాగా ఈ సినిమా కోసం కొరటాల బాగా కష్టపడుతున్నారు. అందుకే ఆచార్య ప్లాప్ తర్వాత నుంచి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు.

దేవర హిట్ కొట్టాకే మీడియా ముందుకు రావాలి అనుకున్నాడట. అయితే ఆ విషయంలో కొరటాల మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న సత్యదేవ్ తాజాగా నటించిన సినిమా కృష్ణమ్మ. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇది ఫుల్ టు ఫుల్ యాక్షన్ మూవీ గా తెరకెక్కింది. ఈ సినిమా కొరటాల శివ ప్రెసెంట్స్ లో నిర్మితమైంది .

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు రాబోతున్నాడట కొరటాల శివ. దీంతో కొరటాల శివ దేవర కంటే ముందే మీడియాతో చిట్ చాట్ చేయబోతున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . ఖచ్చితంగా కొరటాల శివ మీడియా ముందుకు వస్తే జనాలు అడిగే మొదటి ప్రశ్న దేవర సినిమాకి సంబంధించి ఖచ్చితంగా ఆరాకొరా ప్రశ్నలు వేయకుండా ఉండరు . దానికోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news