Moviesచనిపోయిన కూడా ఆ విషయంలో శభాష్ అనిపించుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే.....

చనిపోయిన కూడా ఆ విషయంలో శభాష్ అనిపించుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే.. రియల్లీ గ్రేట్-గ్రేట్-గ్రేట్..!!

సోషల్ మీడియాలో కొంతమంది హీరోయిన్స్ పేర్లు ఎలా మారుమ్రోగిపోతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా వాళ్ల పేర్లను ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా యంగ్ కుర్రాళ్ళు అయితే వాళ్లను దేవతల ఫీల్ అయిపోతూ ఉంటారు. నిజానికి ఇప్పటి హీరోయిన్స్ కాదు ఒకప్పటి హీరోయిన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి . ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు మన మధ్యలో లేకపోయినప్పటికీ వాళ్ల పేర్లు తలచుకుంటున్నామంటే వాళ్ళ నటన – టాలెంట్ – అందం అని చెప్పాలి. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సౌందర్య – – దివ్యభారతి శ్రీదేవి. రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన వార్త వైరల్ గా మారింది . చాలా చిన్న ఏజ్ లోనే వీళ్ళు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు . ఇప్పటికీ ఫ్యాన్స్ ఆ విషయంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా చనిపోయిన కూడా వీళ్ళు ఒక విషయంలో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. అది ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

సౌందర్య: పేరుకు కన్నడ బ్యూటీ నే కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎలా పాపులారిటీ సంపాదించుకుందో మనకి బాగా తెలుసు. ఒకానొక టైం లో స్టార్ హీరోలు అందరూ కూడా సౌందర్య మా సినిమా ఉండాలి మా సినిమాలో ఉండాలి అంటూ మొండి పట్టుదల పట్టారు . అంతేకాదు అప్పట్లో హ్యూజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ కూడా ఈమె కావడం గమనార్హం. సౌందర్య ఓ ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించింది . ఆమె మరణించే సమయానికి ఆమె ప్రెగ్నెంట్ అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . అంతేకాదు సౌందర్య చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం తల్లిదండ్రులకి చెందాలి అంటూ వీలునామా ఎప్పుడో రాసేసిందట . కానీ భర్త మోసం చేసి ఆ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా టోటల్ ఆస్తిని ఆయన తినేశాడు అంటూ ఇప్పటికీ వార్తలు వినిపిస్తున్నాయి.

దివ్యభారతి : ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . ఈమె నటించిన సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం . దానికి కారణం అందం ఒక రీజన్ అయితే ఆమె నటన మరొక రీజన్ అని చెప్పాలి. దివ్యభారతి సూసైడ్ చేసుకుని మరణించింది . చాలా చిన్న ఏజ్ లోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది . దివ్యభారతి చనిపోయే టయానికి ఆమెకు 70 కోట్లకు పైగానే ఆస్తి తన పేరుపై ఉందట . ఆస్తి మొత్తం కూడా తల్లిదండ్రులకే చెందింది.

శ్రీదేవి : అతిలోకసుందరి ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ యంగ్ ఏజ్ లో ఉన్న.. సీనియర్ ఏజ్ లో ఉన్న ఆమె అందగత్తె అంటూ పొగిడేసేవారు . మన ఇండస్ట్రీలో ఇప్పటికీ అందరు స్టార్ హీరోలకి మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ఇమె కావడం గమనార్హం. శ్రీదేవి దుబాయిలో ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది . శ్రీదేవి చనిపోయిన తన ఆస్తి మొత్తం తన భర్త బోనికపూర్.. తన పిల్లలు జాన్వికపూర్ – ఖుషి కపూర్ కే దక్కింది. ఇలా మరణించిన కూడా కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం కూడా కుటుంబ సభ్యులకి ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు ఈ హీరోయిన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news