Moviesజాన్వి ఖాతాలో మరో బంపర్ ఆఫర్ .. ఈసారి ఆ లక్కీ...

జాన్వి ఖాతాలో మరో బంపర్ ఆఫర్ .. ఈసారి ఆ లక్కీ హీరో ఎవరు అంటే..?

ఒక్కొక్క హీరోయిన్ అవకాశాలు రాక అల్లాడిపోతుంది.. నానాదంటాలు పడిపోతున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అయినా ఇప్పటికి ఒక పాన్ ఇండియా సరసన నటించే సినిమా ఆఫర్ దక్కించుకోలేకపోతున్నారు ముద్దు గుమ్మలు . అయితే జాన్వి కపూర్ మాత్రం వరుసగా బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశం దక్కించు ఉండడం ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉంది .

అసలు.. ఆమెకి ఇంత మంచి అవకాశాలు ఎలా వస్తున్నాయి అంటూ షాక్ అయిపోతున్నారు. జాన్వి కపూర్ తెలుగులో దేవర అనే సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఈ సినిమాలో హీరోగా నటించేది జూనియర్ ఎన్టీఆర్ .. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోతోనే ఎంట్రీ ఛాన్స్ కొట్టేసింది . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్తోను ఇంకో సినిమా ఆఫర్ దక్కించుకుంది .

అయితే ఈ సినిమాకి వెళ్లక తలకే రాజమౌళి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోనూ ఆఫర్ దక్కించుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ వార్తలు పై ఇంకా అఫీషియల్ ప్రకటన రాకముందే ఇప్పుడు మరో క్రేజీ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . దీనికి సంబంధించిన న్యూస్ అటు టాలీవుడ్ లోనూ ఇటు బాలీవుడ్ లోనూ వైరల్ గా మారింది . పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ సంపాదించుకున్న ప్రభాస్ తో జత కడితే జాన్వీ కెరియర్ ఏ రేంజ్ లో మలుపు తిరగబోతుందో మనకు తెలిసిందే . దీనికి సంబంధించిన న్యూస్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు జాన్వి అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news