Moviesఅమ్మ బాబోయ్ .. ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఇంత మంది అమ్మాయిలు...

అమ్మ బాబోయ్ .. ప్రభాస్ ప్రపోజ్ చేస్తే ఇంత మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారా..? ఏం పోయేకాలం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా వైరల్ గా మారింది . పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి సంబంధించిన న్యూస్ కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ గా మారిపోయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ .. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఏ స్థాయిలో ఉన్నాడో మనకు తెలిసిందే . ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుటున్నాడు . అయితే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కల. అది నెరవేరుతుందో నెరవేరదో ఎవరు చెప్పలేకపోతున్నాం. ఆ దేవుడికే తెలియాలి అంటూ కొంతమంది ఫ్యాన్స్ చేతులెత్తేశారు .

అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ గా మారింది. ఆరడుగుల అందగాడు ఆజానబాహుడు.. ఆయన ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా ఎలా రిజెక్ట్ చేయగలదు..? అని అనుకుంటూ ఉంటారు జనాలు . కానీ అది తప్పు అంటూ లేటెస్ట్గా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తెలుస్తుంది. ప్రభాస్ కూడా లవ్ ఫెయిల్యూర్ అట . ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలను ప్రేమించారట . ముగ్గురు కూడా హ్యాండ్ ఇచ్చేశారట. ముగ్గురు కూడా రిజెక్ట్ చేశారట . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . ప్రభాస్ చదువుకునే టైంలోనే ఒక అమ్మాయిని డీప్ గా ప్రేమించాడట.

అయితే ఆ అమ్మాయి ప్రభాస్ ని రిజెక్ట్ చేసిందట . చిన్న ఏజ్ కావడం అది లవ్ ..లేదా.. అట్రాక్షన్ తెలియకపోవడం అనే కారణంగానే ఆమె రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ప్రభాస్ ఇంటర్లోను ఒక అమ్మాయిని లవ్ చేశాడట. అయితే ఆ అమ్మాయి కొన్ని రోజులు బాగా ప్రభాస్తో ఫ్రెండ్షిప్ చేసినట్లే చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందట . ముచ్చటగా మూడోసారి ప్రభాస్ హీరోయిన్ త్రిషకు ప్రపోజ్ చేసినట్లు వార్తలు వినిపించాయి .

అంతేకాదు త్రిష కూడా ఆయనకు ఓకే చేసిందట . కానీ త్రిష ప్రభాస్ తో పాటు మరొక టాలీవుడ్ హీరోని కూడా లవ్ చేస్తుంది అని వార్తలు రావడంతో ప్రభాస్ ఆమెను దూరం పెట్టాడు. ఇలా ప్రభాస్ ప్రతిసారి లవ్ లో ఫెయిల్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్ లాంటి అందగాడిని ఎలా మిస్ చేసుకున్నారు వీళ్ళు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . వీళ్ళకి ఇదేం పోయే కాలం అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు . ప్రజెంట్ ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం బిజీగా ముందుకు వెళ్తున్నాడు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news