Gossipsసెలెక్ట్ కోసం ఎన్టీఆర్ సందడి .!

సెలెక్ట్ కోసం ఎన్టీఆర్ సందడి .!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాదు బుల్లితెర మీద కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. వాణిజ్య ప్రకటనలలో ఎన్.టి.ఆర్ పంథానే వేరుగా ఉంటుంది. లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ సెలెక్ట్ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారని తెలిసిందే. ఇక దీని కోసం ఓ ఫోటో షూట్ చేశారు.

ఎన్.టి.ఆర్ స్టైలిష్ ఫోటో షూట్ వీడియో ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. ఫోటో షూట్ అనే మాటే కాని చిన్న పాటి సినిమా సెటప్ చేశారు. మరి అది ఎన్.టి.ఆర్ రేంజ్ అంటే.. మొత్తానికి ఎన్.టి.ఆర్ ఖాతాలో సెలెక్ట్ బ్రాండింగ్ చేరింది. దీని కోసం ఎన్.టి.ఆర్ దాదాపు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక సినిమాల మాట కొస్తే ప్రస్తుతం అరవింద సమేత సినిమా చేస్తున్న తారక్ ఈసారి కూడా దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు.

https://youtu.be/txC0VjQbE1g

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news