Gossipsబయోపిక్ లో ఛాన్స్ కొట్టేసిన నిహారిక..!

బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసిన నిహారిక..!

మహానటి బయోపిక్ సినిమా సూపర్ హిట్ అవడంతో దర్శ నిర్మాతలంగా బయోపిక్ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ బయోపిక్, వైఎస్సార్ బయోపిక్ యాత్ర సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఇప్పుడు మెగా డాటర్ నిహారిక సూర్యాకాంతంగా నటించనుందట. సూర్యకాంతం అనగానే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో గయ్యాలి అత్త పాత్రలో నటించిన నటీమణి అని తెలిసిందే.

ఆ పాత్రను ఇప్పటివరకు రిప్లేస్ చేసింది లేదు. కొన్నాళ్లు తెలంగాణా శకుంతల ఆ ప్రయత్నం చేసినా ఆమె కాలం చేయడంతో ఇప్పుడు అలాంటి పాత్రలకు ఆర్టిస్టులు కరువయ్యారు. అయితే మెగా డాటర్ నిహారిక సూర్యకాంతంగా నటిస్తుందట. నిజంగానే సూర్యకాంతంగా నిహారిక నటిస్తుందా అంటే వెబ్ సీరీస్ నాన్న కూచి దర్శకుడు ప్రణీత్ ఫీచర్ ఫిల్మ్ గా సూర్యకాంతం సినిమా చేస్తున్నడట. సినిమాలో నిహారిక పాత్రకు ఆ టైటిల్ కరెక్ట్ అని ఫిక్స్ చేశారట. టైటిల్ చూసి కచ్చితంగా ఇది సూర్యకాంతం బయోపిక్ అనుకునే అవకాశం ఉంది. మరి నిహారిక ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ శుక్రవారం నిహారిక హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news