Moviesమోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్...

మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్ ఊహించని షాక్..!

మోక్షజ్ఞ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య కొడుకు . మోక్షజ్ఞ గురించి ఇండస్ట్రీలో ఎలాంటి వార్తలు వినిపిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . నందమూరి బాలయ్య వారసత్వాన్ని కొనసాగించే హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది . ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ అంటూ ఊరిస్తున్నారు ..తప్పిస్తే పలానా సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు అనే విషయం పై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడం నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోయే విషయం .

కాగా ఈ మధ్యకాలంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . మోక్షజ్ఞ – బాలయ్య కెరియర్ లోని సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమాని రీమేక్ చేస్తూ ఆదిత్య 999 అనే సినిమా పేరుతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే ఆ సినిమా అసలు తెరకెక్కుతుందో లేదో కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . దానికి కారణం బాలయ్య నమ్మే పురోహితుడు.

మోక్షజ్ఞ జాతకం ప్రకారం 2025 సెప్టెంబర్ వరకు ఆయన జాతకం బాగోలేదు అని …ఆ కారణంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకపోవడమే బెటర్ అంటూ సూచించారట. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటించి నమ్మే బాలకృష్ణ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీని లేటుగా ఇప్పించాలి అంటూ ఆలోచిస్తున్నారట . దీంతో నందమూరి ఫ్యాన్స్ డీల పడిపోతున్నారు . మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనుకున్న ఆలస్యం అవుతుంది ఏంటి అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగా నందమూరి అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రెసెంట్ బాలయ్య ఏపీ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నాడు . వన్స్ రాజకీయాలు షెడ్యూల్ కంప్లీట్ అయిపోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించబోతున్నారు .ఆ తర్వాత అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news