Gossipsఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నాడు..!

ఒకప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నాడు..!

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ పేరులో బాబు మోహన్ కూడా ఒకరు. సినిమా పరిశ్రమలో కమెడియన్ గా సూపర్ క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న బాబు మోహన్ ప్రస్తుతం టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంత రాజకీయ నేత అయినా సినిమాల మీద ఉన్న ప్రేమ ఎలా తగ్గుతుంది చెప్పండి. అందుకే కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ సిని కెరియర్ కొనసాగించాలని చూస్తున్నాడు బాబు మోహన్.

అందులో భాగంగా తన కెరియర్ లో బాగా పేరు తెచ్చిన ముష్టోడి పాత్రని మళ్లీ వేస్తున్నారు బాబు మోహన్. బిచ్చగాడా మజాకా సినిమాలో బాబు మోహన్ బిచ్చగాడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన మీద ఓ పాట కూడా షూట్ చేయడం జరిగింది. ఇంత బువ్వుంటెయ్యమ్మో.. ఇంత కూరుంటెయ్యమ్మో.. అని అప్పట్లో ముష్టి పాటతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బాబు మోహన్ ఇప్పుడు బిచ్చగాడా మజాకా సినిమాలో కూడా అదే పాత్రతో వస్తున్నాడు. మరి ఈ టర్న్ బాబు మోహన్ ను మల్లీ సిల్వర్ స్క్రీన్ స్టార్ కమెడియన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news