Moviesఆ విషయంలో ఈ స్టార్ హీరో అనుష్క శెట్టి కి రుణపడిపోయాడా..?...

ఆ విషయంలో ఈ స్టార్ హీరో అనుష్క శెట్టి కి రుణపడిపోయాడా..? ఈ ఫ్యాన్స్ మరీ ఓవర్ చేస్తున్నారే..!

ఫ్యాన్స్ .. తమ ఫేవరెట్ హీరోను .. ఫేవరెట్ హీరోయిన్ను పొగిడేస్తూ ఉంటారు . అది ఏ విషయంలోనైనా సరే ..చిన్న మంచి పని చేస్తేనే .. పెద్ద మంచి పని చేసిన విధంగా భావిస్తూ అభిమానులు ఓ రేంజ్ లో ఆ హీరోను .. హీరోయిన్ ను ప్రశంసిస్తూ ఉంటారు . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ అనుష్క శెట్టి కు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

అనుష్క శెట్టి సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా అనుష్క కెరీర్ ని మలుపు తిప్పింది . అనుష్క తన కెరీర్ లో చేసిన ఒకే ఒక్క ఐటెం సాంగ్ స్టాలిన్ మూవీలో ..అది కూడా మెగాస్టార్ చిరంజీవితో ..స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరియర్ పిక్స్ లో ఉండగానే అనుష్క ఐటెం సాంగ్ లో నటించి శభాష్ అనిపించుకుంది.

అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ఓ రేంజ్ లో బాగా ట్రెండ్ చేశారు. అంతేకాదు కొంతమంది అనుష్క ఫ్యాన్స్ కూడా అనుష్క ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ మెగాస్టార్ అరుదైన ఘనత అందుకున్నాడు అని.. అనుష్క కెరియర్ లోనే చేసిన ఒకే ఒక్క ఐటెం సాంగ్ ఇదే అని .. ఓ రేంజ్ లో ఆమెను పొగిడేసారు . అంతేనా కూసింత హద్దులు మీరుతూ ఆ హీరో అనుష్కకు రుణపడిపోయాడు అంటూ కూడా స్వీటీ అభిమానులు టంగ్ స్లిప్ అయ్యారు. అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఆ తర్వాత… అనుష్క ఇండస్ట్రీలో ఎలా టాప్ హీరోయిన్గా ఎలా రాజ్యమేలేసిందో మనకు తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news