Moviesఅన్ని తెలివితేటలు ఉన్న ఎన్టీఆర్ ఆ ఒక్క మాటకే మహిళ చేతిలో...

అన్ని తెలివితేటలు ఉన్న ఎన్టీఆర్ ఆ ఒక్క మాటకే మహిళ చేతిలో మోసపోయాడా..? తెర పైకి కొత్త డౌట్స్ ..!

జూనియర్ ఎన్టీఆర్ .. నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే పేరు . అయితే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంగానే ట్రెండ్ అవుతూ వచ్చాడు . పలుసార్లు రాజకీయాల విషయంగా ట్రెండ్ అవుతూ వచ్చాడు . కొన్నిసార్లు ట్రోలింగ్కి కూడా గురయ్యాడు . అయితే ఒక మహిళ చేత్తో మోసపోయి కోర్టు మెట్లు ఎక్కిన విషయంగా ఫస్ట్ టైం సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తారక్ పేరు మారు మ్రోగిపోతుంది . పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అలాగే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఏది రిలీజ్ అయిన సరే బాగా బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా ఎన్టీఆర్ తన బర్త్డ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయాడు . ఆయన బర్త డే నాడు పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ పై ఓ కేసు విషయంలో న్యూస్ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన్నట్లు తెలుస్తుంది.

హైదరబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఓ ప్లాట్ ని 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుండి ఎన్టీఆర్ కొనుకున్నాడు. అయితే అప్పటికే ఆ మహిళా 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా లోన్స్ తీసుకుందట. అయితే ఎన్టీఆర్ దగ్గార ఈ విషయాన్ని దాచిపెట్టింది ఆ మహిళ. 2003 నుండి ఎన్టీఆర్ ఈ ప్లాట్ ఓనర్ గా కొనసాగుతున్నాదు. అయితే అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో ఈ ప్లాట్ విషయంలో వివాదం కొనసాగుతూనే ఉందట. ప్రాపర్టీను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించడంతో గతంలో పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాడట తారక్. తాజాగా డృట్లో( డెబ్త్ ఋఎచొవెర్య్ ట్రిబునల్) జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు ఎన్టీఆర్. జూన్ 3 లోపు డృట్ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. దీనిపై జూన్ 6న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయితే అంత టాలెంట్ ఉన్న తారక్..ఆ మహిళ చేతిలో ఎలా మోసపోయాడు అనేది ఇంప్పుడు పెద్ద డౌట్..? మహిళా కష్టాలల్లో ఉన్నాను అనే మాట తోనే తారక్ మనసు కరిగించేసింది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news