Moviesఅనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబోలో..మిస్ అయిన సూపర్ డూపర్...

అనుష్క శెట్టి – పవన్ కళ్యాణ్ కాంబోలో..మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తాయి . అయితే ఆ సినిమాలో మొదటగా అనుకున్న హీరో హీరోయిన్ వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. మరి కొన్నిసార్లు ఆ పాత్ర చేయాలని ఉన్న కూడా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉండొచ్చు.. రీసెంట్ గా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సెట్ అవ్వడం చాలా చాలా రేర్.

వాటిల్లో ఒకటే అనుష్క శెట్టి – పవన్ కళ్యాణ్. వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత మిస్ అయింది. కాగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన బంగారం సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది అనుష్క శెట్టి. అయితే ఇది చిన్న క్యారెక్టర్ .. లాస్ట్ మినిట్లో త్రిష ట్రైన్ ఎక్కుతుంది.. అప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక్క సీన్ ఉంటుంది .

ఆ సీన్ డైరెక్టర్ అనుష్క శెట్టితో ఊహించుకున్నాడట . అయితే అనుష్క శెట్టి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. కేవలం ఒక్క సీన్ కోసం నటించాలా..? అంటూ అనుష్క శెట్టి ఈ సినిమా ఆఫర్ ను వదులుకునిందంట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. కాగా అనుష్క శెట్టి. . తీసుకున్న నిర్ణయం అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఓ రేంజ్ లో ఆమెపై కోప్పడ్డారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే ఆ తర్వాత అదంతా ఇండస్ట్రీలో కామన్ అంటూ కొట్టి పడేశారు జనాలు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పలు సినిమాలలో నటిస్తున్నాడు. మరోవైపు రాజకీయాలలోనూ బిజీగా ఉన్నాడు . అనుష్క శెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ వచ్చిన ఆఫర్స్ ను సద్వినియోగం చేసుకుంటుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news