Moviesనా బుజ్జిని కలుసుకోవడానికి ఈగర్లీ వెయిటింగ్.. ప్రభాస్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

నా బుజ్జిని కలుసుకోవడానికి ఈగర్లీ వెయిటింగ్.. ప్రభాస్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. కాగా త్వరలోనే “నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి డార్లింగ్..అంటూ పోస్ట్ చేశాడు ప్రభాస్ . దీంతో సినిమా ఇండస్ట్రీ సోషల్ మీడియా షేక్ అయిపోయింది . ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . కాగా ఎవరు ఆ హీరోయిన్..? అంటూ తెగ తెగ వార్తలు వైరల్ అయిపోయాయి.

కొందరు ఏకంగా ఓ బడా పొలిటిషియన్ మనవరాలు తో ప్రభాస్ పెళ్లి జరగబోతుంది అంటూ ప్రచారం చేశారు. రీసెంట్గా ప్రభాస్ నుంచి మరో అదిరిపోయే పోస్ట్ వచ్చింది. కల్కి పోస్టర్ రిలీజ్ చేస్తూ ..”డార్లింగ్ నేను నా బుజ్జిని కలుసుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాను” అనే క్యాప్షన్ ఇచ్చేశాడు”. అయితే కల్కిలో ఓ మిషిన్ కూడా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. దాని పేరే బుజ్జి అంటూ తెలుస్తుంది. రేపు అనగా 18న సాయంత్రం ఐదు గంటలకు దానిని పరిచయం చేయబోతున్నారట మేకర్స్ . దీంతో ప్రభాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే కొందరు మాత్రం పూర్తి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ప్రభాస్ చెప్పిన స్పెషల్ పర్సన్ ఇదా..? అంటుంటే మరికొందరు కాదు కాదు ఇదంతా సినీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన పబ్లిసిటీ స్టంట్ అంటూ మండిపడుతున్నారు . అసలు ప్రభాస్ లైఫ్ లోకి వచ్చే స్పెషల్ పర్సన్ ఎవరో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. మొత్తానికి డార్లింగ్ కూడా హద్దులు మీరిపోయి సినీ ప్రమోషన్స్ కోసం పరసనల్ లైఫ్ ని వాడుకుంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news