Moviesఇది నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే.. మన ఎన్టీఆర్ కోసం సూర్య...

ఇది నిజమైన ఫ్రెండ్ షిప్ అంటే.. మన ఎన్టీఆర్ కోసం సూర్య ఏం చేశాడో చూడండి..శభాష్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్స్ నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఒకే తేదీన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే బద్ధ శత్రువుల కన్నా దారుణంగా మాటలు యుద్ధంతో పోట్లాడుకుంటున్నారు . చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏదేదో అరుచుకుంటున్నారు. అయితే అలాంటి సిచువేషన్ లోనూ ఫ్రెండ్షిప్ అంటే ఇదే అని ప్రూవ్ చేసేలా హీరో సూర్య చేసిన పని ఇప్పుడు అభిమానని ఆకట్టుకుంటుంది . అంతే కాదు సూర్యని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు మన తెలుగు జనాలు .

వరుసహిట్లతో ఉన్న సూర్య ప్రస్తుతం భారీ పిరియాడికల్ ఫిలిం కంగువ లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు సూర్య అభిమానులు. ఇప్పటివరకు చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని మనకు చూపించబోతున్నాడు దర్శకుడు శివ . రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి . రాజా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది . చాలా సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్ .

అయితే ఏప్రిల్ 5 ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో మేకర్స్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నారట. ఈ ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట . అంతేకాదు ఒక సినిమాకి మరొక సినిమా కాంపిటీషన్ కాకూడదు అని అందరం సినిమా ఇండస్ట్రీలో ఒక్కటే అని ప్రతి ఒక్కరికి తమ సినిమా హిట్ అవ్వడం ఇంపార్టెంట్ అని ..సూర్య ఈ నిర్ణయం తీసుకున్నారట . అంతేకాదు సినిమా షూటింగ్స్ వి ఎఫ్ ఎక్స్ , ప్రొడక్షన్ వర్క్ చాలా పెండింగ్ లో కూడా ఉందట . అందుకే తొందరపడకుండా త్వర త్వరగా తప్పులు చేయకుండా నిదానంగా షూట్ కంప్లీట్ చేసి ఎన్టీఆర్ కి అడ్డు రాకుండా తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట సూర్య. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆయన నిర్ణయానికి ఫిదా అయిపోతున్నారు . నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇదేగా అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news