Moviesబాలీవుడ్ రామాయణంలో సీత పాత్రను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి...

బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి బ్యూటీ ఎవరో తెలుసా..? దరిద్రం అంటే ఇదే..!

ఈ మధ్యకాలంలో రామాయణం కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువైపోతున్నాయి . మరీ ముఖ్యంగా బడాబడా డైరెక్టర్స్ అందరూ కూడా రామాయణంని తమదైన స్టైల్ లో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ ఎన్నో సినిమాలు రామాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కి రిలీజ్ అయి మంచి టాక్ అందుకున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో రామాయణాన్ని తెరకెక్కించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నారు .

దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే ఇవ్వలేదు . కానీ తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయిన పిక్స్ ఆధారంగా ఈ సినిమా షూట్ మొదలైపోయింది అంటూ తెలుస్తుంది. తాజాగా రామాయణం సినిమా షూట్ నుంచి కొన్ని పిక్స్ నెట్టింట లీక్ అయ్యి వైరల్ మారాయి . ఆ పిక్స్ లో రాముడి పాత్రలో రణబీర్ .. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి చాలా చాలా ఆకట్టుకుంటున్నారు. చాలామంది సీతాదేవి లుక్ లో సాయి పల్లవి అదిరిపోయింది అని సాయి పల్లవి కచ్చితంగా ఈ సినిమాతో మరో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకోబోతుంది అని.. బాలీవుడ్ చరిత్రను తిరగరాయబోతుంది సాయి పల్లవి అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో సీతాదేవి పాత్ర రిజెక్ట్ చేసిన అన్ లక్కి హీరోయిన్ ల పేరు లు వైరల్ గా మారాయి. నిజానికి ఈ సినిమాలో సీతాదేవి పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని చూస్ చేసుకున్నారట . అయితే అందరూ కూడా పలు కారణాల చేత రిజెక్ట్ చేశారట. మరీ ముఖ్యంగా కృతి సనన్.. నయనతార పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి . మొదట ఈ సినిమాలో సీతాదేవి పాత్ర కోసం కృతి సనన్ ని అనుకున్నారట. కృతి సనన్ ఆల్రెడీ ఆది పురుష్ సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించింది. మరొకసారి అదే పాత్రలో కనిపిస్తే జనాలకు ఇంట్రెస్ట్ కలగదు అన్న కారణంతో రిజెక్ట్ చేసిందట . నయనతార రన్బీర్ కపూర్ పక్కన తాను సూట్ అవ్వను అన్న కారణంతో రిజెక్ట్ చేసిందట ..పాత్ర కోసం సాయి పల్లవి సెలెక్ట్ అయింది .. ఏ మాటకు ఆ మాట ఈ పాత్రలో సాయి పల్లవిని తప్పిస్తే మరొకరిని ఊహించుకోలేము అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news