Moviesఛీ..ఛీ.. తారక్ ను తొక్కేయడానికి అలాంటి పనులు చేస్తున్నారా? ఏం మనుషులు...

ఛీ..ఛీ.. తారక్ ను తొక్కేయడానికి అలాంటి పనులు చేస్తున్నారా? ఏం మనుషులు రా బాబు..!

ఒకరు బాగుపడుతున్నారు అంటే ఆ వ్యక్తిని తొక్కేయడం ..లేదా కిందకి లాగేయడం లాంటివి చేస్తూ ఉంటారు . అది ఏ రంగమైన సర్వసాధారణం . అలాంటివి మనం చూస్తూనే ఉంటాం . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి ఉంటాయా..? అంటే ఎస్ ఉంటాయి అన్న ఆన్సర్ వినిపిస్తుంది . అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అంతకుముందు ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమా సెట్స్ లో పాల్గొన్నాడు.

రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే . ముంబై హోటల్లోకి ఎంటర్ అవుతున్న మూమెంట్లో కెమెరామెన్ ఆయన్ను రికార్డ్ చేయడం ..అదే సమయంలో తారక్ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ..కీప్ ఇట్ బ్యాక్ అంటూ గట్టిగా అరిచేసాడు తారక్ . దీంతో బాలీవుడ్ మీడియా ఆయనపై దుమ్మెత్తి పోసింది ..గ్లోబల్ స్ధాయి హీరోకి అంత కోపం పనికిరాదు అంటూ కావాలనే ట్రోల్ చేసింది . ఆ తర్వాత ఆయన ఎందుకు అరిచాడు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.

పర్సనల్గా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అలాంటి రికార్డ్ చేయకూడదు అన్న మినిమం కామన్సెన్స్ మిస్సయిన కెమెరామెన్ రికార్డ్ చేస్తూ తన వెనుక పడడం వల్లే అలా అరిచాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా బాలీవుడ్ హీరోలు తారక్ పై దారుణాతి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఇద్దరు హీరోలు తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేయడానికి మీడియాకు డబ్బులు ఇచ్చి మరి ఆయనపై వెటకారంగా న్యూసులు రాయిస్తుందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్ను బాయ్ కట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక టాలెంటెడ్ హీరోని తొక్కేయడానికి ఇలాంటి పనులు కూడా చేస్తారా..? సిగ్గు లేదా అంటూ బాలీవుడ్ హీరోలను ఏకపారేస్తున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news