Moviesబాలకృష్ణ-పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్సయిన ఆ సూపర్ డూపర్ హిట్ మూవీ...

బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్సయిన ఆ సూపర్ డూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..? ఎవరు రిజెక్ట్ చేశారంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొత్త టేస్ట్లు.. కొత్త కాంబోలు ఉండడానికి ఫ్యాన్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . ఒకే హీరో ఒకే సినిమాలో నటించడం కన్నా ఇద్దరు హీరోలు ఒక సినిమాలో నటిస్తే ఆ క్రేజ్ ..ఆ కిక్ ..ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే వేరేగా ఉంటుంది అని అంటున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ ట్రెండ్ బాగా కొనసాగుతుంది . అయితే కొంతమంది మాత్రం అలా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు . తాజాగా సోషల్ మీడియాలో టాలీవుడ్ బడా హీరోలు బాలకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి .

పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ ఇద్దరు ఇండస్ట్రీలో తోపైన హీరోలే ..ఇద్దరికి సర్టైన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఇద్దరు కూడా మొండి వాళ్లే .. తాము చెప్పిందే వినాలి అనే టైప్ . వీళ్లిద్దరిని పెట్టి సినిమా తెరకెక్కించాలి అనుకున్నాడు ఒక డైరెక్టర్ . అయితే ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు బాలయ్య. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

బాలయ్య – పవన్ కళ్యాణ్ కాంబోలో మిస్సయింది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా. అదే గోపాల గోపాల . ఈ సినిమాలో వెంకటేష్ నటించిన పాత్ర కోసం ముందుగా బాలయ్యను అనుకున్నారట మేకర్స్. ఈ పాత్రకు బాలయ్య అయితే మరింత సూట్ అవుతాడు అని అభిప్రాయపడ్డారట . అనుకున్న విధంగానే బాలయ్య ఇంటికి వెళ్లి కథ కూడా వివరించారట. కానీ బాలయ్య కథ తన బాడీకి తన వే ఆఫ్ లాంగ్వేజ్ కి ఈ కథ సూట్ కాకపోవచ్చు అంటూ అభిప్రాయపడ్డారట . అంతేకాదు దేవుడు పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నప్పుడు ఇలాంటి పాత్రలో తాను కనిపిస్తే ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ముందుగానే ఊహించిన బాలయ్య ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ మూవీ వెంకటేష్ ఖాతాలో చేరింది . ఈ సినిమాలో వెంకటేష్ – పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news