Moviesబాలీవుడ్ కి వెళ్లగానే ఎన్టీఆర్ ఇలా మారిపోయాడు ఏంటి..వీడియో వైరల్..!

బాలీవుడ్ కి వెళ్లగానే ఎన్టీఆర్ ఇలా మారిపోయాడు ఏంటి..వీడియో వైరల్..!

మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ . ఆయనకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించినా సరే చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు . దీంతో ఫ్యాన్స్ ఆయన లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు . కాగా ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూలు కంప్లీట్ అయ్యాయి.

త్వరలోనే మూడవ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . కాగా ఇదే క్రమంలో బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పై కి తీసుకొచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్ . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ లో నటించారు . తాజాగా మరొక వారం రోజులపాటు బాలీవుడ్ లోనే మకాం వేసి మరి ఈ సినిమాకి సంబంధించిన మిగతా సీన్స్ ని కూడా కంప్లీట్ చేయబోతున్నారు.

అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళాక బాలీవుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోతున్నాడు ఎన్టీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ తన భార్యతో మీడియా కంట కనపడ్డారు. దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి ముంబై లోని బాంద్రాలో ఓ డిన్నర్ పార్టీకి వెళ్ళాడు. ఈ పార్టీకి ఎన్టీఆర్ – ప్రణతి – రన్బీర్ కపూర్ – ఆలియా భట్ – కరణ్ జోహార్లు అందరూ కలిసి వచ్చారు . ఇంకా చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది . జనరల్ గా ఇలాంటి పార్టీలు ఎన్టీఆర్కి ఇష్టం ఉండదు. కానీ బాలీవుడ్ లో ఇదంతా కామన్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో నెట్టుకు రావాలి అంటే ఇలా చేయాల్సిందే. ప్రజెంట్ ఎన్టీఆర్ – ప్రణతి బాలీవుడ్ సెలబ్రిటీల వీడియోలు వైరల్ గా మారాయి. కొంత మంది ఎన్టీఆర్ లుక్స్ ని పొగిడేస్తుంటే మరి కొంతమంది బాలీవుడ్ ఇండస్ట్రీని ఏళ్ళబోయే హీరో మన ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news