Movies"ఆ హీరో కనిపిస్తే చాలు .. ఫట్ అదే చూస్తా".. హీరోయిన్ఠా...

“ఆ హీరో కనిపిస్తే చాలు .. ఫట్ అదే చూస్తా”.. హీరోయిన్ఠా మృణాల్ ఠాకూర్… సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మృణాల్ ఠాకూర్ .. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు . అంతే కాదు టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు కూడా ఇదే కావడం గమనార్హం . ఈమధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ముందుకెళ్ళిపోతుంది . అఫ్ కోర్స్ ఆమె నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతున్న సరే మేకర్స్ ఆమెతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. దానికి కారణం మృణాల్ ఠాకూర్ కు జనాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాలి .

తెలుగులో హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్న మృణాల్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిగ్ డిజాస్టర్ తన ఖాతాలు వేసుకుంది. అయినా సరే ఇప్పటికి ఆమె తెలుగులో మూడు సినిమాల్లో బిజీగా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మృణాల్ ఠాకూర్ . ఈ క్రమంలోనే యాంకర్ నుండి మీ ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది . ఈ క్రమంలోనే జనాలు కూడా ఆమె నోటి నుండి వచ్చే ఆ పేరు కోసం ఎక్కువగా వెయిట్ చేశారు. సాధారణంగా ఏ హీరోకి అయినా ఏ హీరోయిన్ కి అయినా ఒక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఉంటారు.

మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . రీసెంట్గా ఆమె ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం బయటపడింది. ” నా ఫేవరెట్ హీరో షాహిద్ కపూర్.. నేను జెర్సీ సినిమాలో నటించినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.. అంతేకాదు షాహిద్ అంటే చాలా చాలా ఇష్టం. అవకాశం వచ్చినప్పుడల్లా ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను. అసలు నేను ఆ సినిమాను ఓకే చేసింది షాహిద్ కపూర్ కోసం ..ఆయన కనిపిస్తే చాలు లొకేషన్లో ఆయన నవ్వును చూస్తూ అలాగే ఉండిపోతా.. ఆయన నవ్వితే చాలా బాగుంటాడు .. ఆయన నవ్వు నాకు చాలా చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చింది. మృణాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . ఎంతో మంది బడా బడా హీరోలతో నటించింది మృణాల్.కానీ షాహిద్ కపూర్ పేరు మాత్రమే చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news