Moviesదటీజ్ మహేష్ బాబు రేంజ్.. ఆయనను చూడగానే ప్రభాస్ పెద్దమ్మ ఏం...

దటీజ్ మహేష్ బాబు రేంజ్.. ఆయనను చూడగానే ప్రభాస్ పెద్దమ్మ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..!

సాధారణంగా ఎవరైనా స్టార్ సెలబ్రిటీస్ కనిపిస్తే పరుగు పరుగున అక్కడికి వెళ్తాం. ఫొటోస్ దిగుతాం. మాట్లాడుతూ ఉంటాము. లేకపోతే వాళ్లతో ఇంకొన్ని ఫొటోస్ దిగడానికి ట్రై చేస్తాము. సాధారణంగా జనాలు ఇదే చేస్తూ ఉంటారు . అయితే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు . ఎందుకంటే వాళ్లు ప్రతి ఒక్క పార్టీలోనూ లేదా పలు సందర్భాలలోనూ కలిసే ఉంటారు . అయితే కొంతమంది హీరోలని చూస్తే మాత్రం మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాము.

మనం పదేపదే చూసిన డైలీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా సరే వారిని చూడగానే వీడు మనవాడు అనే ఫీలింగ్ కలుగుతుంది . అప్పుడు మనం మన స్టేటస్ మన స్థాయి పక్కన పెట్టి మరీ వెళ్లి మాట్లాడుతాము. తాజాగా అలాంటి పని చేసింది ప్రభాస్ పెద్దమ్మ. రీసెంట్గా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి హైదరాబాదులో జరిగిన ఓ పెళ్ళికి హాజరయ్యారు . ఈ పెళ్లికి మహేష్ బాబు- నమ్రత – సితార కూడా హాజరయ్యారు . మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు .

అయితే ఆ పెళ్లిలో మహేష్ బాబు – నమ్రత – సితారాలను చూసిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి చూసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని పలకరించి.. ప్రేమతో ఫోటోలు తీసుకుంది ..అలాగే నమ్రతను కౌగిలించుకొని పలకరించింది. సితార తలపై చేయి పెట్టి ఆశీర్వదించింది . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మహేష్ బాబు అంటే ప్రభాస్ పెద్దమ్మకి చాలా చాలా ఇష్టమని… ప్రభాస్ పెద్దమ్మ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలను మాత్రమే లైక్ చేస్తుంది అని ..వాళ్లలో ఒకరే ఈ మహేష్ బాబు అని.. ఈ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news