Moviesసైలెంట్ గానే బన్నీకి రాడ్ దించేసిన రామ్ చరణ్... ఈ షాక్...

సైలెంట్ గానే బన్నీకి రాడ్ దించేసిన రామ్ చరణ్… ఈ షాక్ ని ఫ్యాన్స్ కూడా ఊహించలేదుగా..పాపం ఎలా తట్టుకుంటారో ఏమో..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యాన్స్ ఎలా సోషల్ మీడియా వేదికగా తిట్టుకుంటూ ఉంటారో.. ట్రోల్ చేస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ బన్నీల ఫ్యాన్స్ బాగా ఫైట్ చేసుకున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్స్ మెసేజెస్ చేసుకోవడమే కాకుండా.. మా హీరోనే తోపు అంటూ కూడా పలు ఎగ్జాంపుల్స్ చూపిస్తూ బాగా సోషల్ మీడియాలో హీట్ పెంచేశారు .

అయితే ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు . ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులకి చేరవేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే హీరో ఎవరు అంటే అందరూ చెప్పే పేరు బన్నీ . అయితే అలాంటి బన్నీ ను కూడా దాటేశాడు రామ్ చరణ్ . రామ్ చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు . ఏదో వాడామా అంటే వాడామా అన్న రేంజ్ లో ఉంటాడు . అలాంటి స్టార్ హీరో రామ్ చరణ్ కు ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అమమతం పెరిగిపోయింది .

ఆయన పెట్టిన పోస్ట్లు కేవలం 277 కానీ ఆయన ఫాలోవర్స్ సంఖ్య చూస్తే మాత్రం బుర్ర తిరిగి పోవాల్సిందే . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ని చేరుకున్నాడు రామ్ చరణ్ . చాలా ఫాస్ట్ గా రాంచరణ్ ఈ ఘనత అందుకోవడం విశేషం. అంతేకాదు అత్యంత ఫాస్ట్ గా ఈ ఘనతను చేరుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ గా రికార్డ్ సృష్టించాడు రామ్ చరణ్ . అయితే ఈ రికార్డు గతంలో అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ లో పేరిట ఉండింది. ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లను చెరిపేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రామ్ చరణ్. దీంతో రామ్ చరణ్ ఫాన్స్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు .

విజయ్ దేవరకొండ 2050 రోజుల్లో ఈ ఘనతను సాధిస్తే అల్లు అర్జున్ 1925 రోజుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. అయితే మన రామ్ చరణ్ మాత్రం ఏకంగా 1635 రోజుల్లోనే ఈ ఘనతను సాధించి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేశాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news