Moviesరామ రామ..ఈ చరణ్ కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు.....

రామ రామ..ఈ చరణ్ కి ఏమైంది..? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు.. ప్లీజ్ వద్దు రా..!

తెలిసి చేస్తున్నాడో.. తెలియక చేస్తున్నాడు అర్థం కావడం లేదు కానీ.. రామ్ చరణ్ తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన కెరియర్ బొక్క బోర్ల పడడం ఖాయం అనే రేంజ్ లో జనాలు చేత కామెంట్స్ చేయించేలా చేస్తున్నాయి . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఆ స్టేటస్ వచ్చాక ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయించి మంచి డెసిషన్స్ తీసుకోవాలి . కాని చరణ్ మాత్రం అల్లరి చిల్లరగా డెసిషన్స్ తీసుకుంటున్నారు అంటున్నారు అభిమానులు .

ఎవరు ఊహించిన విధంగా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కి అవకాశం ఇవ్వడమే బిగ్ మిస్టేక్ అని బాధ పడిపోతున్నారు. ఎలాగోలా ముక్కి మూలిగి సినిమా షూట్ ను కంప్లీట్ చేశాడు . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు అని ఆనందపడే లోపే రామ్ చరణ్ అభిమానులకు మరో బిగ్ షాక్ ఇచ్చాడు . ఈ సినిమా సెట్స్ కి రావడానికి దాదాపు రెండు నెలల టైం పడుతుందట. అంతేకాదు ఈ సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

ఇది బిగ్ బిగ్ మిస్టేక్ అంటున్నారు సినీ విశ్లేషకులు . రామ్ చరణ్ లాంటి గ్లోబల్ హీరో తన సినిమాను ఏకంగా ఏడాది తర్వాత రిలీజ్ చేయాలి అని డిసైడ్ అవ్వడం మూర్ఖమైన నిర్ణయం అంటున్నారు . అఫ్ కోర్స్ మెగా ఫాన్స్ కి కూడా అదే ఫీలింగ్ . ఎందుకు చరణ్ ఇలా చేస్తున్నాడు..? అంటూ బాధ పడిపోతున్నారు . సినిమా త్వరగా కంప్లీట్ చేసి త్వరగా రిలీజ్ చేస్తే మెగా ఫ్యాన్స్ సంబరపడతారు కదా.. సినిమా హిట్ టాక్ నీకు ప్లస్ అవుతుంది కదా ఎందుకు ఏకంగా ఏడాది కాలం పాటు ఈ సినిమాని రిలీజ్ చేయకుండా ఆపాలి అనుకుంటున్నారు ..అనే విషయం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దీంతో రామ్ చరణ్ ఫాన్స్ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news