Moviesహిట్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసుకుంటున్న తెలుగు హీరోలు.. బొక్క బోర్లా...

హిట్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసుకుంటున్న తెలుగు హీరోలు.. బొక్క బోర్లా పడడం ఖాయమా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.. ఆ విషయం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా మహేష్ బాబు లాంటి హీరోలు తన సినిమా పూజా కార్యక్రమానికి ఆయన వెళితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న నమ్మకంతో తన సినిమా పూజా కార్యక్రమానికి అసలు మహేష్ బాబు వెళ్ళనే వెళ్ళడు . ఈ విషయం కూడా మనందరికీ తెలుసు . ఇలాంటి సెంటిమెంట్స్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే సెంటిమెంట్ .

శుక్రవారం నాడు సినిమా రిలీజ్ చేయడమే. అలా రిలీజ్ చేస్తే సినిమాకి కలెక్షన్స్ పరంగా కలిసి వస్తుంది అని .. హిట్ టాక్ కూడా వస్తుంది అన్న నమ్మకం అందరు హీరోలకు ఉంది . అయితే రాను రాను ఆ హిట్ సెంటిమెంట్ బ్రేక్ చేసేస్తున్నారు హీరోలు . మరీ ముఖ్యంగా హీరోలు శుక్రవారం సెంటిమెంట్ను అస్సలు పట్టించుకోవడం లేదు . త్వరలోనే రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా గురువారం నాడు రిలీజ్ కాబోతూ ఉండడం గమనార్హం . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా గురువారం నాడే రిలీజ్ కాబోతుంది .

అదేవిధంగా కమల్ హాసన్ తన కెరియర్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఇండియన్ 2 . ఈ సినిమా జూన్ 13వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఇది కూడా గురువారం. అదేవిధంగా టాలీవుడ్ చరిత్రను తిరగరాయడానికి పుష్ప రాజ్ గా వచ్చేస్తున్న బన్నీ నటించిన పుష్ప2 సినిమా కూడా గురువారం నాడే రిలీజ్ కాబోతుంది . ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి సిద్ధమైన దేవర సినిమా కూడా అక్టోబర్ 10వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కూడా గురువారం నాడే రిలీజ్ కాబోతుంది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ ని పక్కన పెట్టేశారు అంటూ ప్రచారం జరుగుతుంది కొంతమంది సినీ విశ్లేషకులు . అది కొన్నిసార్లు బాగుంటుంది అని వన్స్ సినిమా ఫ్లాప్ అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news