Moviesప్రభాస్ "కల్కి 2898AD" మే 9 నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో...

ప్రభాస్ “కల్కి 2898AD” మే 9 నే ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..? ఏం స్కెచ్ వేశావయ్య నాగ్ అశ్విన్..!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్.. కెరియర్ లోనే ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ టు ఫుల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ హిందూ మైథాలజీ కథతో తెరకెక్కుతుంది . ఈ సినిమాలో కమలహాసన్ , దీపికా పదుకొనే , దిశాపటాని , అమితాబచ్చన్ లాంటి స్టార్ యాక్టర్స్ యాక్టర్లు కూడా నటిస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.

నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాలి కానీ కొన్ని వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవ్వడం కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. కాగా సోషల్ మీడియాలో కల్కి టీజర్ లీకై వైరల్ గా మారింది. కల్కి టీజర్ కి సంబంధించిన వీడియో నెట్టింట లీక్ అయింది. ఆ వీడియోలో సినిమా రిలీజ్ డేట్ క్లియర్ గా తెలిసిపోతుంది . మే 9న 2024న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. నిజానికి వైజయంతి మూవీస్ కు మే 9 చాలా లక్కీ ..

గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, కీర్తి సురేష్ నటించిన మహానటి , మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో మే 9న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు తమ సంస్థ 50 పురస్కారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వస్తున్న కల్కి సినిమా కూడా ఆ కలిసొచ్చిన డేట్ నే రిలీజ్ కాబోతున్నందుకు ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news