Moviesవెంకటేష్ "సైంధవ్" మూవీ ట్విట్టర్ రివ్యూ : అన్ని బాగున్న అది...

వెంకటేష్ “సైంధవ్” మూవీ ట్విట్టర్ రివ్యూ : అన్ని బాగున్న అది మాత్రం కవర్ చేయకలేకపోయాడుగా.. సో శాడ్..!!

సంక్రాంతి కానుకగా వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నిన్న మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ..తేజా సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి . కాగా నేడు కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా రిలీజ్ అయింది . చాలాకాలం తర్వాత వెంకటేశ్ తో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది.

ముందునుంచి వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో అన్న టాక్ ఉండనే ఉంది . కానీ ఈ సినిమాతో ఆ ట్యాగ్ ను డబుల్ చేసుకున్నాడు. కేవలం ఫామిలీ సెంటిమెంట్ కాదు యాక్షన్ సినిమాలో కూడా చేయగలను అంటూ ప్రూవ్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా ఈ సినిమాకి కథ చాలా హిట్. అదేవిధంగా వెంకటేష్ నటించిన యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడని చెప్పాలి. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత వెంకటేష్ ఇంత భారీ యాక్షన్ సీన్స్ లో నటించడం గ్రేట్ అంటున్నారు అభిమానులు .

అంతేకాదు సెంటిమెంట్, డ్రామా, యాక్షన్ అన్ని కలగవలసిన సినిమా ఇది అని ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంజాయ్ మూవీ అని ట్యాగ్ చేస్తున్నారు . అంతేకాదు హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ సినిమా స్టోరీలో ల్యాగ్ ఉంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఫస్ట్ డే సైంధవ్ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో..??? మొత్తానికి పాజిటీవ్, నెగెటీవ్ కలయికలో సైంధవ్ రివ్యూలు నడుస్తున్నాయి. మరి ఈరోజు రిలీజ్అయిన తరువాత తెలుస్తుంది ఈమూవీకి కలెక్షన్స్ వస్తాయా..? ఆడియన్స్ ఆదరిస్తారా..? సంక్రాంతి బరిలో ఉన్న గుంటూరు కారం,హనుమాన్, నాసామి రంగ సినిమాలను దాటుకుని ఈమూవీ ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news