Moviesగుంటూరు కారం ఎఫెక్ట్: యంగ్ బ్యూటీ శ్రీలీల సంచలన నిర్ణయం.. షాక్...

గుంటూరు కారం ఎఫెక్ట్: యంగ్ బ్యూటీ శ్రీలీల సంచలన నిర్ణయం.. షాక్ లో అభిమానులు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ఎంత టాప్ పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అమ్మడు చేసిన ప్రతి సినిమా ఆమెకు బాగా పాజిటివ్ కామెంట్స్ తెచ్చిపెడుతుంది . రీసెంట్గా నటించిన గుంటూరు కారం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది . కధా.. కంటెంట్ విషయం పక్కన పెడితే శ్రీ లీల అందం శ్రీ లీల ఊర నాటు మాస్ డాన్స్ సినిమాకి మంచి ఊపు తెప్పిస్తున్నాయి.

రీసెంట్గా శ్రీలీలకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే శ్రీ లీల ఒకపక్క చదువుకుంటూ మరొక పక్క సినిమాలు చేస్తూ మరొకపక్క పలు రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటుంది . అయితే రీసెంట్ గా ఓ మద్యం బ్రాండ్ , బెట్టింగ్ యాప్ గురించి ఆమెను ప్రమోట్ చేయమంటూ ఆఫర్లు వచ్చాయట . కానీ అలాంటి దరిద్రమైన పనులు నేను చేయను అంటూ నిర్మోహమాటంగా ముఖం మీద చెప్పేసిందట .

జనాలను తప్పుదోవ పట్టించే పనులు చచ్చిన చేయను అంటూ స్ట్రైట్ గా వాళ్లకే ఆన్సర్ ఇచ్చిందట. దీంతో శ్రీ లీల తీసుకున్న నిర్ణయం అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది . అందరూ హీరోయిన్స్ నీలాగా ఉంటే ఎంత బాగుండు శ్రీలీల అంటూ ఆమెను పొగిడేస్తున్నారు. మరికొందరు ఆమె తీసుకున్న ఈ బోల్డ్ నిర్ణయానికి షాక్ అవుతున్నారు. చేసుంటే కోట్లు వచ్చుండేవి గా అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news