Moviesయు నాటీ ఫెలో..రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? శృతి హాసన్...

యు నాటీ ఫెలో..రాజమౌళిలో ఈ యాంగిల్ కూడా ఉందా..? శృతి హాసన్ లో అది అంటే ఇష్టమా..?

సీనియర్ ముద్దుగుమ్మ శృతిహాసన్‌కు ఈ ఏడాది పట్టిందల్లా బంగారం అనుకోవాలి. సంక్రాంతికి టాలీవుడ్ లో సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవికి జోడిగా చేసిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాలయ్యకు జోడిగా వీర‌సింహారెడ్డి, చిరంజీవికి జోడిగా వాల్తేరు వీరయ్య సినిమాలలో ఆమె నటించింది. సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఇక ఈ ఏడాది చివర్లో ప్రభాస్ కి జోడిగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఆమె నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్‌తో మొదలైంది. సలార్ దెబ్బతో శృతిహాసన్ పాన్ ఇండియా రేంజ్‌లో మరోసారి పాపులర్ కానుంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్లు కూడా తక్కువగా జరిగాయి. దర్శకధీరుడు రాజమౌళి.. సలార్ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలపై ప్రశ్నలు వేశారు. హీరోయిన్ శృతిహాసన్ గురించి కూడా రాజమౌళి ప్రశ్న వేశారు. శృతిహాసన్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం.. ప్రభాస్, శృతిహాసన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో కచ్చితంగా ఒక డ్యూయెట్ ఉంటుందని అందరూ భావిస్తారు.. కానీ ఎందుకు పాట పెట్టలేదు.. అంటూ దర్శకుడు ప్రశాంత్‌ను.. రాజమౌళి ప్రశ్నించారు.

దీనికి ప్రశాంత్ ఆన్సర్ ఇస్తూ ముందుగా పాట పెట్టాలని అనుకున్నా.. సినిమా మొత్తం ఒక డ్రామాగా కొనసాగుతుందని.. అందుకే పాట పెట్టడం కరెక్ట్ కాదని డ్యూయెట్ పెట్టలేదని.. ప్రశాంత్‌ తెలిపాడు. ఏది ఏమైనా రాజమౌళి తనకు శృతిహాసన్ డ్యాన్స్‌ అంటే ఇష్టం అంటూ చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది. ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్ లో శృతిహాసన్ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి సలార్ దెబ్బతో శృతిహాసన్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో నేమ్ రానుంది. రాజమౌళి తన తర్వాత సినిమాలో అయినా ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా శృతిహాసన్ తన డ్యాన్స్ తో దర్శక ధీరుడికే మతులు పోగొట్టేలా చేసిందంటే అమ్మడు మామూలుది కాదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news