Moviesఅద్గది అద్ది ప్రశాంత్ నీల్ అంటే..సలార్ పార్ట్ 2 టైటిల్ ఏంటో...

అద్గది అద్ది ప్రశాంత్ నీల్ అంటే..సలార్ పార్ట్ 2 టైటిల్ ఏంటో తెలుసా? “ప్రభాస్ రాజు”..ఫ్యాన్స్ కి అరుపు పెట్టించే పేరు..!!

హమ్మయ్య ..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూవీ సలార్ మూవీ రిలీజ్ అయిపోయింది. ప్రభాస్ అభిమానులు ఊహించినట్లుగానే ఈ సినిమాలో దిమ్మతిరిగే అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి . కళ్ళు చెదిరే రేంజ్ తో పాటు అద్భుతమైన డైలాగ్ డెలివరీ కూడా ఉన్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు బంపర్ కలెక్షన్స్ కూడా సాధిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు .

కాగా ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ నటించే పార్ట్ 2 పైనే ఉన్నాయి. పార్ట్ 1 లో ఉన్న వారంతా అక్కడి అధికారం కోసం కొట్టుకున్నట్లు పృథ్వీరాజ్ కూడా అధికారం కోసం ప్రభాస్ సాయం కోరినట్లు మనకు చూపిస్తాడు. ప్రభాస్ తన స్నేహితుడి కోసం ఏం చేశాడు అని చూపిస్తారు . అయితే కొన్ని సీన్స్ పూర్తి కాకుండానే పార్ట్ వన్ ముగిసింది . పార్ట్ 2 ప్రకటించారు.

పార్ట్2 సిజ్ ఫర్ కాగా పార్ట్ 2 కి “శౌరంగపర్వం” అంటూ పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక పార్ట్ 2 లో అసలు ప్రభాస్ ఎవరు ..? ఎక్కడ పుట్టాడు..? పృథ్వీరాజ్ ప్రభాస్ పాత్రల మధ్య శత్రుత్వం ఎలా వచ్చింది? కాన్స్ర్ రాజు ఎవరు అవుతారు..? శృతిహాసన్ని ప్రభాస్ ఎందుకు కాపాడుతున్నాడు..? ప్రభాస్ తల్లి ఎందుకు కట్టడి చేస్తుంది..? శౌరంగ పర్వం అంటే ఏంటి ..? అనేటివి పార్ట్ 2లో చూపించమన్నారు . నిజానికి అసలు కథ మొత్తం పార్ట్ 2 లోనే ఉంది. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే . పార్ట్ 2 అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అంటూ ప్రకటించాడు ప్రశాంత్ నీల్. దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news