Movies"దేవ" క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న ఆ పాన్ ఇండియా హీరో...

“దేవ” క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న ఆ పాన్ ఇండియా హీరో ఎవరో తెలిస్తే.. తలలు పట్టుకుంటారు పక్కా.. !!

టైం బాగోలేనప్పుడు ఏమైనా జరగొచ్చు అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు . బహుశా ఈ విషయం తెలుసుకున్నాక అది నిజమే అనిపిస్తుంది . దేవుడు అదృష్టాన్ని తలుపు తట్టి ఇంటికి పిలిపిస్తే.. వద్దు పో కరెక్ట్ టైం లో రాలేదు ..నువ్వు రాహుకాలంలో వచ్చావు అంటూ తరిమేస్తామా..? కాదు కదా అదృష్ట దేవత ఎప్పుడు ఇంటికి వచ్చిన తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తాం . అయితే కొంతమంది మూఢనమ్మకాలతో పిచ్చి సెంటిమెంట్స్ తో లక్ష్మీదేవిని వెనక్కి పంపిస్తూ ఉంటారు .

అలానే చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు టాలీవుడ్ హీరో . ఆయన మరెవరో కాదు రామ్ చరణ్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ చేతికి సలార్ కథ వెళ్లిందట . ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా చేస్తున్న టైంలోనే ఈ కథను అనుకున్నారట . ఆ మూమెంట్లోని ఆర్ఆర్ఆర్ సినిమా కూడా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం . అయితే ఆ మూమెంట్లో ఎన్టీఆర్ కోసం ఆల్రెడీ ఒక కధని ఫిక్స్ చేసుకున్నాడు ప్రశాంత్ నిల్ .

అయితే సలార్ సినిమా కథను చరణ్ తో తెతకెక్కిస్తే బాగుంటుంది అని ఇప్పటివరకు ఈ జోనర్ ల్లో రాంచరణ్ ఒక్క సినిమా కూడా చేయలేదు అని అభిప్రాయపడ్డారట . కానీ రామ్ చరణ్ అప్పటికే వేరే సినిమాలు కి కమిట్ అవ్వడం ..పైగా ఇది ఫుల్ మాస్ లుక్ కావడం.. పైగా తనకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ పాత్రకి ఉండడంతో అంతగా హిట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేశారట . చిరంజీవి కూడా ఈ కథను రిజెక్ట్ చేశారట . అంతగా పవర్ లేదు వేరే కథను ట్రై చేయండి అంటూ సలహా ఇచ్చారట. ఫైనల్లీ ఈ కథను ప్రభాస్తో తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news