Moviesతను వర్క్ చేసిన హీరోలలో శృతిహాసన్ కు..ది మోస్ట్ ఫేవరెట్ తెలుగు...

తను వర్క్ చేసిన హీరోలలో శృతిహాసన్ కు..ది మోస్ట్ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

శృతిహాసన్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . లోకనాయకుడు మల్టీ టాలెంటెడ్ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా తన లక్ ని పరీక్షించుకునింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . అంతేకాదు ఆ తర్వాత కూడా పలు సినిమాలో నటించినప్పటికీ శృతిహాసన్ కి సరైన హిట్ దక్కలేదు. అప్పుడే ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేశారు .

కానీ శృతిహాసన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు . కాగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న శృతిహాసన్ కు మంచి బ్రేక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంది శృతిహాసన్ . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో కాటమరాయుడు సినిమా వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకుపోయినప్పటికీ వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేశారు .

ఆ తర్వాత శృతిహాసన్.. సూర్య – అల్లు అర్జున్ – చిరంజీవి – బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది . రీసెంట్గా ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో నటించిన మూమెంట్స్ ను గుర్తుచేసుకుంది . “తాను ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలతో వర్క్ చేసిన పవన్ కళ్యాణ్ వెరీ స్పెషల్ అని ..తన లైఫ్ని ఆయన మార్చేసాడని ..అలాంటి పర్సన్ ఎప్పుడు నాకు ఫేవరెట్ అని చెప్పుకొచ్చింది”. దీంతో ఆమె చెప్పకుండానే పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని హింట్ ఇచ్చేసింది . ప్రజెంట్ ఇవే కామెంట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news