Moviesఒకే ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న...

ఒకే ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్న నిహారిక.. న్యూ ఇయర్ కి ముందే హేటర్స్ కు ఇచ్చి పడేసిందిగా..!!

నిహారిక .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు . మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఢీ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . ఆ తర్వాత ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా తన సినీ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ ఆమె కెరియర్ ఆశాజనికంగా ముందుకు వెళ్లలేదు .

ఈ క్రమంలోనే ఆమె సినిమా ఇండస్ట్రీకి బై బై చెప్పేసి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయింది . ఆ తర్వాత విడాకులు తీసుకొని ఇప్పుడు సింగిల్ గా మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది . రీసెంట్గా నిహారిక కతక్ డాన్సర్ గా మారి నృత్యం చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఎప్పుడు నిహారిక పై ట్రోల్ చేసే జనాలు సైతం నిహారికను పొగిడేస్తూ పాజిటివ్ కామెంట్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు .

అంతేకాదు మెగా అభిమానులు నిహారిక ఫొటోస్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తూనే మెగాహేటర్స్ కు ఇచ్చి పడేసింది నిహారిక అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . నిహారిక ఏ ఫొటోస్ షేర్ చేసిన ట్రోల్ చేయడానికి ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది . అయితే ఎటువంటి నెగిటివ్ అంశం లేకుండా తనపై వస్తున్న వాటికి ఈ విధంగా మంచి ఫోటో షేర్ చేసి చెక్ పెట్టింది నిహారిక అంటున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news