Moviesఆ విడాకులు తీసుకున్న హీరో పాత్రలో నాని.. కావాలనే కెలుకుతున్నట్లు ఉన్నాడే..!

ఆ విడాకులు తీసుకున్న హీరో పాత్రలో నాని.. కావాలనే కెలుకుతున్నట్లు ఉన్నాడే..!

నాని .. రొటీన్ కి భిన్నంగా ఉండే సినిమాలను చూస్ చేసుకుంటూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో. నాచురల్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సంవత్సరం నానికి చాలా చాలా స్పెషల్ . ఈ ఏడాది మొదట్లో దసరా సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని చివర్లో హాయ్ నాన్న.. సినిమాతో అద్భుతమైన హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

నానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . “సరిపోతా శనివారం” సినిమా తర్వాత నానికు చాలా చాలా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి . అయితే నాని మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండే సినిమాలను చూస్ చేసుకుంటున్నాడు. రీసెంట్గా కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది . అయితే ఈ కథ కూడా కాంట్రవర్షియలే కావడం గమనార్హం.

ఇండస్ట్రీలో ఓ బడా హీరో విడాకులకు సంబంధించిన కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకు వస్తున్నాడు ఆ న్యూ డైరెక్టర్ . ఆ విడాకులు తీసుకున్న హీరో పాత్రలో మన నాని కనిపించబోతున్నాడట . ఇది ఫుల్ గా కాంట్రవర్షియల్. అయినా సరే సమాజానికి ఉపయోగపడే సినిమా అని.. భార్యాభర్తలకు ఈ సినిమా చాలా ఉపయోగపడుతుంది అన్న కారణంతో నాని ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news