Newsఅబ్బబ్బా..ఏం గోల్డెన్ ఛాన్స్ ఇది.. ఇంటికి పిలిచి డింపుల్ హయాత్ కి...

అబ్బబ్బా..ఏం గోల్డెన్ ఛాన్స్ ఇది.. ఇంటికి పిలిచి డింపుల్ హయాత్ కి ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో..!

ఎస్ ఇది నిజంగా డింపుల్ హయతి ఫాన్స్ కు పండగ చేసుకునే వార్త అనే చెప్పాలి . ఇప్పటివరకు సరైన హిట్ అందుకొని డింపుల్ హయత్ కు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది . అది కూడా ఏకంగా స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ . దీంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . ఫైనల్లి ఒక్క సినిమా అయిన తన ఖాతాలో హిట్ వేసుకో బోతుంది అంటూ ఆనందపడుతున్నారు. డింపుల్ హయాతి నటించబోయే హీరో ఎవరో తెలుసా? మల్టీ టాలెంటెడ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి .

కోలీవుడ్లో చిన్న చిన్న పాత్రలో నటించి తన కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత మంచి స్థాయినటుడిగా పేరు సంపాదించుకున్న విజయ్ సేతుపతి.. ప్రజెంట్ విలన్ పాత్రలో కూడా నటించి మెప్పిస్తున్నాడు. షారుక్ నటించిన జవాన్ సినిమా హిట్ అవ్వడానికి షారుక్ ఎంత కారణమో..? విలన్ విజయసేతుపతి అంతే కారణమని మర్చిపోకూడదు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న సినిమా “ట్రైన్”.

మిస్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ పతాకంపై భాను నిర్మిస్తున్నారు . ఈ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఫుల్ టు ఫుల్ స్వాతంత్ర నేపథ్యంలో సాగే ట్రైన్ ట్రావెలింగ్ కధా చిత్రంగా ఇది అని తెలుస్తుంది . ఈ చిత్రంలో మరో సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడట విజయ్ సేతుపతి . ఇందులో డింపుల్ హయాతి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది . దీంతో ఎట్టకేలకు తన నటన ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని ఈ సినిమాతో ఆమెకు హిట్ పక్కా అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news