Newsసిమ్రాన్ నడుముకి కాదు.. దానికి ఫ్లాటైన టాలీవుడ్ స్టార్ హీరోలు...!

సిమ్రాన్ నడుముకి కాదు.. దానికి ఫ్లాటైన టాలీవుడ్ స్టార్ హీరోలు…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది సిమ్రాన్. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వాలి సినిమాతో సౌత్ లో బాగా పాపులర్ అయింది. తెలుగులో నటించిన మొదటి సినిమా అబ్బాయిగారి పెళ్లి. ఈ సినిమాలో సుమన్ హీరోగా నటించాడు. తెలుగులో సిమ్రాన్ నటించిన అబ్బాయిగారి పెళ్లి ఇండస్ట్రీలో దర్శకులను హీరోలను బాగా ఆకట్టుకుంది.

తెలుగులో మా నాన్నకి పెళ్లి, గొప్పింటి అల్లుడు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల తర్వాత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిన సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమాతో సిమ్రాన్ కి టాలీవుడ్ లో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సిమ్రాన్ నడుము చాలా హాట్ టాపిక్ అప్పట్లో. అలాంటి నాజూకు నడుము అప్పటి వరకూ ఏ హీరోయిన్ ది చూడలేదు.

దాంతో సాంగ్స్ లో మాత్రమే కాదు, సీన్స్ లో కూడా సిమ్రాన్ నడుము మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా సిమ్రాన్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎలాంటి సీన్ అయినా డైలాగ్స్ తెలుగు స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్టుగా ఎంతో స్పష్ఠంగా చెప్పేది. ఈ విషయంలో దర్శకులు, డబ్బింగ్ చెప్పేటప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా సిమ్రాన్ గురించి చాలా బాగా చెప్తారు.

అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ ..ఇలా అందరూ సిమ్రాన్ సరసన నటించడానికి చాలా తాపత్రయపడ్దారు. స్వయంగా హీరోలే మాకు సిమ్రాన్ కావాలని మేకర్స్ కి చెప్పి తమ సినిమాలలో ఫిక్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కమల్ హాసన్ కూడా సిమ్రాన్ అంటే ఉత్సాహం చూపించారు. అలా అటు తమిళంలో ఇటు తెలుగులో సిమ్రాన్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news