Newsమహేష్, చరణ్, ప్రభాస్ వల్లే ఎన్టీఆర్ సినిమాలు డిజాస్టర్లు.. 100 %...

మహేష్, చరణ్, ప్రభాస్ వల్లే ఎన్టీఆర్ సినిమాలు డిజాస్టర్లు.. 100 % నిజం ఇది..!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా ఎవరూ చెప్పలేరు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైతే అదే జానర్ లో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు ప్రాధాన్యత ఇస్తారు. స్టార్ హీరోలు సైతం ఒకప్పుడు అప్పటికే హిట్టైన సినిమా లాంటి కథ కావాలని కండీషన్లు పెట్టేవారు. అయితే అలాంటి కండీషన్ల వల్ల కొన్నిసార్లు మొదటికే మోసం వస్తుంది. అయితే మహేష్, చరణ్, ప్రభాస్ ఇండస్ట్రీ హిట్లు జూనియర్ ఎన్టీఆర్ ను ముంచేశాయి.

2006 సంవత్సరం ఏప్రిల్ లో విడుదలైన పోకిరి హిట్ కాగా ఈ సినిమాకు మెహర్ రమేష్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. పోకిరి తరహా కాన్సెప్ట్ లో పోకిరి తరహా ట్విస్ట్ లతో ఎన్టీఆర్ కంత్రి తెరకెక్కింది. దారుణం ఏంటంటే కంత్రి సినిమాలోని కొన్ని డైలాగ్స్ పోకిరి డైలాగ్స్ ను మార్చి రాసినట్టుగా ఉంటాయి. ఎన్టీఆర్ యమదొంగ హిట్ తర్వాత స్లిమ్ లుక్ లో కంత్రి సినిమాలో కనిపించగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.

పోకిరి సినిమాకు ముందు విడుదలై ఉంటే కంత్రి రిజల్ట్ మరోలా ఉండేదని ఫ్యాన్స్ భావిస్తారు. పోకిరిని నెత్తిన పెట్టుకున్న అభిమానులు కంత్రికి మాత్రం షాకిచ్చారు. ఒకే తరహా కథతో సినిమా తీస్తే నష్టాలు తప్పవని ఈ సినిమా రిజల్ట్ తో ప్రూవైంది. మహేష్ దూకుడు, ఎన్టీఆర్ బాద్ షా సైతం దాదాపుగా ఒకే తరహా కథలతో తెరకెక్కాయి. దూకుడు హిట్టైన స్థాయిలో బాద్ షా మాత్రం సక్సెస్ సాధించలేదు.

రామ్ చరణ్ మగధీరను ఫాలో అయిన ఎన్టీఆర్ శక్తి సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకోగా రభస సినిమా తర్వాత ఎన్టీఆర్ కథల విషయంలో మారారు. ఊసరవెల్లి సినిమాలో కిక్ సినిమా పోలికలు కనిపిస్తాయని, రామయ్యా వస్తావయ్యా సినిమాలో రెబల్ సినిమా పోలికలు కనిపిస్తాయని మరి కొందరు ఫీలవుతారు. ఎన్టీఆర్ ఇతర హీరోల సినిమాలను ఫాలో అయిన మెజారిటీ సందర్భాల్లో షాకులు తగిలాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news