Newsబాలయ్య - తమన్నా కాంబినేషన్ ఎప్ప‌ట‌కీ ఉండ‌దా... ఇదే కార‌ణ‌మా...!

బాలయ్య – తమన్నా కాంబినేషన్ ఎప్ప‌ట‌కీ ఉండ‌దా… ఇదే కార‌ణ‌మా…!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయనే సంగతి తెలిసిందే. అలాంటి కాంబినేషన్లలో బాలయ్య తమన్నా కాంబినేషన్ కూడా ఒకటి. సీనియర్ హీరోలలో చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున సినిమాలలో నటించిన తమన్నా బాలయ్యతో మాత్రం ఇప్పటికీ నటించలేదు. భగవంత్ కేసరి సినిమా షూట్ సమయంలో తమన్నా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగినా ఆ వార్తలను తమన్నా ఖండించిందనే సంగతి తెలిసిందే. ఐటమ్ సాంగ్ వార్త ఎంతగానో బాధపెట్టిందని అప్పట్లో తమన్నా కామెంట్లు చేశారు.

అయితే నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం బాలయ్య, తమన్నా కాంబినేషన్ లో ఎప్పటికీ సినిమా వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఒక సెంటిమెంట్ వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తమన్నా కాంబినేషన్ లో ఊసరవెల్లి సినిమా తెరకెక్కగా కళ్యాణ్ రామ్, తమన్నా కాంబినేషన్ లో నా నువ్వే సినిమా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అయ్యాయి.

ఒక విధంగా చెప్పాలంటే నందమూరి హీరోలకు తమన్నా కలిసిరాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తర్వాత ప్రాజెక్ట్ లలో తమన్నాను రిపీట్ చేయడానికి ఇష్టపడలేదు. అందువల్ల బాలయ్య తమన్నా కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే తమన్నా మాత్రం బాలయ్య అంటే ఎంతో గౌరవమని బాలయ్యతో సినిమా చేయాలని ఉందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

తమన్నా గత సినిమా భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో తమన్నా సక్సెస్ రేట్ సైతం తగ్గింది. తెలుగులో ఈ బ్యూటీ చేతిలో గతంలోలా ఆఫర్లు అయితే లేవు. బాలయ్య బాబీ మూవీకి త్రిష మరి కొందరి పేర్లు వినిపిస్తున్నా తమన్నా పేరు మాత్రం వినిపించలేదు. భవిష్యత్తులో బాలయ్య, తమన్నా కాంబినేషన్ సినిమా రావడానికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news