News"నాలుగు అవార్డులు కొడితే..నువ్వు ఏమన్నా పెద్ద తోపు డైరెక్టరా..?"..రాజమౌళిని అవమానించిన స్టార్...

“నాలుగు అవార్డులు కొడితే..నువ్వు ఏమన్నా పెద్ద తోపు డైరెక్టరా..?”..రాజమౌళిని అవమానించిన స్టార్ యాక్టర్..!!

సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అన్న పేరు వినపడితే పాన్ ఇండియా లెవెల్ లో అరుపులు కేకలు వినపడతాయి. జక్కన్నగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు . త్వరలోనే మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాలు సైతం అదే స్థాయిలో గుర్తింపు దక్కించుకునేలా చేయడానికి ట్రై చేస్తున్నాడు . ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నిజానికి రాజమౌళి అంటే అందరికీ గౌరవం ..అంతకుమించిన భయం కూడా..

ఎందుకంటే రాజమౌళి రూల్స్ ని పాటించలేం ..ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమాకి వర్క్ చేసే స్టార్ హీరో దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు కంపల్సరీ ఆయన పెట్టిన కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి .. ఆ రూల్స్ ను ఫాలో అవ్వాలి .. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే డైరెక్టర్ రాజమౌళి తన ఎక్స్ప్రెషన్స్ ఆ సీన్స్ వచ్చేవరకు టేకుల మీద టేకులు తీసుకుంటూనే ఉంటారు .

ఈ క్రమంలోనే ఆయన సినిమాలో నటించే ఓ సీనియర్ యాక్టర్ ను చాలా ఇబ్బంది పెట్టేసాడట. దాదాపు 25 టేకులకు పైగా ఒక చిన్న షాట్ కోసం ఆయనను చాలా టార్చర్ చేశారట. దీంతో విసుగెత్తిపోయిన ఆయన ఇండస్ట్రీలో నేను ఎన్నో సినిమాల్లో నటించాను.. నీకంటే పెద్ద డైరెక్టర్ డైరెక్షన్లో నటించాను. ..నీలా ఎవరు చేయట్లేదు .. నా దగ్గర ఇన్ని టేక్స్ తీర్చుకుంటావా ..? ఆఫ్ట్రాల్ రెండు నిమిషాల సీన్ కి అంటూ ఫైర్ అయిపోయారట . అయితే రాజమౌళి మాత్రం చిన్నగా నవ్వేసి ఓకే నెక్స్ట్ షాట్ ప్లీజ్ అంటూ నెక్స్ట్ టేక్ తీసుకొని దాని ఫైనలైజ్ చేసారట . ఎంతటి కోపం గల వ్యక్తులైన సరే రాజమౌళి కూల్ గా డీల్ చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం . ఆ తర్వాత ఆ సీనియర్ యాక్టర్ రాజమౌళి వద్దకు వెళ్లి తప్పైపోయింది క్షమించండి అంటూ క్షమాపణలు కోరాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news