Movies"గర్జించే సింహంలా ఎన్టీఆర్".. ఈ ఒక్క న్యూస్ వింటే చాలు నందమూరి...

“గర్జించే సింహంలా ఎన్టీఆర్”.. ఈ ఒక్క న్యూస్ వింటే చాలు నందమూరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్క..!!

రోజురోజుకీ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఒక సినిమాలో నటిస్తున్నారు. అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కావడం గమనార్హం . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులార్టీ సంపాదించుకున్న హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్ . ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ లీకైన.. రిలీజ్ అయిన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది.

వార్ టు సెట్స్ లో బిజీ గా ఉన్నాడు తారక్. కాగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో తారక్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట . వేటాడే సింహంల తారక్ ఈ సినిమాలో కనిపిస్తారట . అంతేకాదు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తారక్ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారట . హైలెట్ ఏంటంటే హృతిక్ రోషన్ కన్నా ఈ సినిమాలో తారకే బాగా కనిపించబోతున్నాడట. ఆదిత్య చోప్రా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పటివరకు మనం చూడని కనీ విని ఎరుగని లుక్ లో ఈ సినిమాలో చూపించబోతున్నారట . హృతిక్ – తారక్ మధ్య వచ్చే సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి అంటూ ప్రచారం కూడా జరుగుతుంది . ఈ సినిమా కోసం మరో 15 నెలలు ఎదురుచూపులు తప్పవు . ఈ సినిమా ప్రొడక్షన్ పనులు కోసమే ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది . వార్ 2 సినిమా 2025 సంవత్సరం ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news