Moviesహమ్మయ్య..ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూయించిన శ్రీలీల.. భలే హీరోతో ఆఫర్...

హమ్మయ్య..ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూయించిన శ్రీలీల.. భలే హీరోతో ఆఫర్ పట్టేసిందే..!

శ్రీ లీల.. ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోయిన్ . మరీ ముఖ్యంగా శ్రీ లీలపై ఈ మధ్యకాలంలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో కూడా మనకి తెలుసు . దానికి కారణం గుంటూరు కారం సినిమా . మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. అయితే ఈ సినిమాలో శ్రీ లీల క్యారెక్టర్ పెద్దగా లేదు అని కేవలం డ్యాన్సులు ..గ్లామర్ కోసమే త్రివిక్రమ్ వాడుకున్నారు అని శ్రీలీలాను బకరా చేశారు అంటూ ఓ విధంగా ట్రోల్ చేశారు .

అమ్మడికి ఈ సినిమా తర్వాత ఆఫర్స్ రావడం కరువయ్యాయి అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే తెలుగులో ఆ తర్వాత ఒక్క సినిమాకి కూడా సైన్ చేయని శ్రీ లీల కోలీవుడ్ లో మాత్రం ఏకంగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విజయ్ దళపతి నటిస్తున్న సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది .

అదే విధంగా అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఆమె నటించబోతుందట. ఇప్పుడు మరో సెన్సేషనల్ హీరోతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు కార్తీ .కోలీవుడ్ ఇండస్ట్రీలో కార్తికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అంతేకాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ దక్కించుకున్నాడు. కార్తీక్ నటించబోయే సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల సెలెక్ట్ అయిందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు గట్టిగా వైరల్ గా మారింది . దీంతో శ్రీల పేరు మరోసారి ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news