Movies20ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్య: ఈ సినిమా మిస్ చేసుకున్న ఆ...

20ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్య: ఈ సినిమా మిస్ చేసుకున్న ఆ ఇద్దరు అన్ లక్కి తెలుగు హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు అలా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి . ఆ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు అవుతున్న సరే ఇంకా ఆ సినిమాకు స్పెషల్ క్రేజ్ పబ్లిసిటీ వస్తూనే ఉంటుంది . అలాంటి సినిమాలలో ఒకటే ఆర్య . టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ..తనదైన స్టైల్ లో తెరకెక్కించిన సినిమా .

నిజం చెప్పాలంటే సుకుమార్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్యనే అని చెప్పాలి . ఈ సినిమాతో సుకుమార్ – అల్లు అర్జున్ – దిల్ రాజు స్టార్స్ గా మారిపోయారు . ఈ సినిమా నేటికీ రిలీజ్ అయి సరిగ్గా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు బాగా వైరల్ గా మారాయి. నేడు హైదరాబాదులో ఆర్య మూవీ టీం మీడియా వాళ్ళ.. పలువురు సినీ ప్రముఖ సమక్షంలో బిగ్ ఈవెంట్ జరపబోతుంది.

ఆర్య 20 ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు టీం. అల్లు అర్జున్ – సుకుమార్ – దిల్ రాజు తో పాటు ఆర్య సినిమాకి పనిచేసిన వాళ్ళు కూడా ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు . అంతేకాదు ఇలాంటి మూమెంట్లోని సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి సుకుమార్ ఆర్య సినిమాను మహేష్ బాబుతో చిత్రీకరించాలనుకున్నారట. కానీ మహేష్ బాబు కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ప్రభాస్ కి కూడా ఈ కథ వినిపించారట . ప్రభాస్ కూడా ఈ కథను రిజెక్ట్ చేశారట . ఫైనల్లీ అల్లు అర్జున్ ఈ కథను ఓకే చేశాడు. వన్ సైడ్ లవ్ అంటూ సూపర్ కాన్సెప్ట్ తో సినిమాని బ్లాక్ బస్టర్ హిట్గా మలిచేసాడు సుక్కు. వీళ్ల కాంబోలో ఇప్పుడు పుష్ప 2 వస్తుంది..ఈ సినిమా గ్లోబల్ స్ధాయిలో హిట్ అవుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news