Moviesచిరంజీవి-శంకర్ కాంబోలో మిస్ అయిన .. రెండు సూపర్ డూపర్ బ్లాక్...

చిరంజీవి-శంకర్ కాంబోలో మిస్ అయిన .. రెండు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే..!

కొన్ని కొన్ని సార్లు మనం ఒకటి అనుకుంటాము.. కానీ తీరా ఇంకొకటి జరుగుతుంది . అలా జరిగినా కూడా మన మంచికే అంటూ సర్దుకుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటి సిచువేషన్స్ చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది . సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమే ఇది మన అందరికీ తెలుసు . అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న శంకర్ – మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలు చేయాల్సి ఉంది.

ఆ రెండు సినిమాలు కూడా ఆఖరి మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయాయి. ప్రెసెంట్ దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది . శంకర్ – చిరంజీవితో చేయాలి అనుకున్న మొదటి సినిమా జెంటిల్మెన్ . అర్జున్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసింది . నిజానికి ఈ సినిమాలో హీరోగా చిరంజీవిని ఊహించుకున్నారట . కానీ ఆఖరికి ఆయన రిజెక్ట్ చేయడంతో అర్జున్తో తెరకెక్కించారు. ఆ తర్వాత చిరంజీవితో తెరకెక్కించాలి అనుకున్న మూవీ ఒకే ఒక్కడు . ఈ సినిమా కథను కూడా ముందుగా తమిళంలో అర్జున్ తెలుగులో చిరంజీవి తో తెరకెక్కించాలనుకున్నారట .

కానీ అప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి శంకర్ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట. అయితే ఆ సినిమాను రిజెక్ట్ చేసి చిరంజీవి చూస్ చేసుకున్న సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి . దీంతో వీళ్ళ కాంబోలో రావాల్సిన రెండు సినిమాలు కూడా మిస్ అయిపోయాయి . ఆశ్చర్యం ఏంటంటే రెండు కూడా అర్జున్ నటించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రజెంట్ చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news