Moviesఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్.. కల్కి 2898AD సినిమాలో మహేశ్ కూడా.....

ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్.. కల్కి 2898AD సినిమాలో మహేశ్ కూడా.. సూపర్ టీస్ట్ ఇచ్చిన నాగ్ అశ్వీన్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి . గత ఏడాది సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ప్రభాస్ .. ఈ ఏడాది ఈ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు . అశ్విని దత్ నిర్మాణ సారధ్యంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27వ తేదీ గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే అలాగే దిశా పటాన్ని నటించారు.

కీలక పాత్రల్లో అమితాబచ్చన్ – కమల్ హాసన్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాగ్ అశ్వీన్ వేరే లెవెల్ లో ప్లాన్ చేశాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు తాజాగా కల్కి 2898 ఏడి చిత్రంలో మహేష్ కూడా భాగం కాబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు తెలుస్తుంది . సినిమా ఇంట్రడక్షన్ తో శ్రీమహావిష్ణువు అవతారం కనిపించబోతుందట . ఆ అవతారానికి మహేష్ బాబు తన గొంతును వినిపించబోతున్నాడట .

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు . ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుందని చెప్పాలి. ఒక పాన్ ఇండియా స్టార్ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్ బాబు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్గా మారింది . అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాగ్ అశ్వీన్ పలువురు బడా హీరోలను కూడా రంగంలోకి దించుతున్నారట . రానా దగ్గుబాటి అదేవిధంగా కీర్తి సురేష్ – దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news