Newsపవన్ సీఎం అవుతారా?..రేణూ దేశాయ్ ఆన్సర్ కి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్...

పవన్ సీఎం అవుతారా?..రేణూ దేశాయ్ ఆన్సర్ కి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్న రేణు దేశాయ్ కు ఎదురైంది.

ఆ ప్రశ్న అడగొద్దని, ఆయన సీఎం అవుతారా లేదా అన్నది తనకు సంబంధం లేని విషయం అని రేణు దేశాయ్ అన్నారు. తాను ఏమీ కోరుకోవడం లేదని, దానిపై స్పందించబోను అని అన్నారు. తాను ఏ స్టాండ్ తీసుకోనని చెప్పారు. తాను చెప్పినవి నిజాలో కాదు లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరి గురించి తాను క్యాంపెయిన్ చేయనని, తన మనసుకు అనిపించింది మాత్రమే చెప్పానని అన్నారు. దాని కంటే తక్కువ, ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదని క్లారిటీనిచ్చారు. ఏది ఏమైనా రేణూ దేశాయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చివరకు ఆ ప్రశ్నకు రేణు దేశాయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఎవరికి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసని, ఏం రాసి పెడితే అది జరుగుతుందని వేదాంత ధోరణిలో ఆ ప్రశ్నకు రేణు దేశాయ్ సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పడానికి తాను ఎవరిని అంటూ ఎదురు ప్రశ్నించారు రేణు దేశాయ్. ఈ అంశంలో తాను ఎటూ మొగ్గు చూపడం లేదని, తటస్థంగా ఉంటానని రేణు క్లారిటీనిచ్చారు. గతంలో తాను ఉన్న నిజాలే చెప్పానని, ఈ రోజు కూడా అదే చెప్తున్నానని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news