Newsలేటైనా లేటెస్టుగా దుమ్ములేపిన ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్..పదేళ్లయినా పవర్ తగ్గేలేదే..!!

లేటైనా లేటెస్టుగా దుమ్ములేపిన ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్..పదేళ్లయినా పవర్ తగ్గేలేదే..!!

తమిళ హీరో విక్రమ్ వరుస విజయాలతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆ తర్వాత వరుస పరాజయాలు, ప్రయోగాలతో పరాజయాలను చవిచూస్తూ చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విక్రమ్ ఆ విజయం ఇచ్చిన కిక్ తో ఎట్టకేలకు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సినిమాను విడుదల చేయబోతున్నాడు. విలక్షణ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ధ్రువ నక్షత్రం’ సినిమా చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు.

షూటింగ్ మొదలుపెట్టి దశాబ్దం కావస్తున్నా బడ్జెట్ పెరిగిపోయిందని, రకరకాల కారణాలతో ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ చిత్రానికి నిర్మాతలు మోక్షం కల్పించారు. నవంబర్ 24 వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోందని నిర్మాతలు ప్రకటించారు. అంతేకాదు, ఈ చిత్రం తమిళ వర్షన్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా నిర్మాతలు విడుదల చేశారు.

బేస్మెంట్ అనే ఓ అండర్ కవర్ ఆపరేషన్ లీడ్ చేసే స్పై పాత్రలో విక్రమ్ కనిపించబోతున్నాడు. ప్రధాని ఆదేశాల ప్రకారం నడిచే ఈ ఆపరేషన్ లో క్రికెట్ టీంలో మాదిరిగా 11 మంది ఉంటారు. పదిమంది టీం రెడీ అవుతుంది కానీ 11వ ప్లేయర్ విక్రమ్ గురించి మాత్రం మిగతా వాళ్ళకి తెలియదు. గౌతమ్ తన మార్క్ డైరెక్షన్ లో కట్ చేసిన ట్రైలర్..యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. లేటుగా వచ్చిన లేటెస్ట్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఆ ట్రెండింగ్ కు తగ్గట్టుగా సినిమా కూడా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news