Moviesమహేశ్ ను అలాంటి జబ్బు మనిషిలా చూపించబోతున్నారా..? త్రివిక్రమ్ డేర్ కి...

మహేశ్ ను అలాంటి జబ్బు మనిషిలా చూపించబోతున్నారా..? త్రివిక్రమ్ డేర్ కి దండం పెట్టాల్సిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఆయన ఓ జబ్బు మనిషిలా కనిపించబోతున్నారా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రతిసారి తన సినిమాలో హీరోయిన్స్ కి ఏదో ఒక రోగం పెట్టి క్యారెక్టర్ డిజైన్ చేస్తూ ఉంటారు .

అయితే ఈసారి మాత్రం డిఫరెంట్ గా ఆయన తన సినిమాలో హీరోకి ఓ జబ్బు ఉండే మనిషిలా క్యారెక్టర్ ను డిజైన్ చేశారట. అయితే గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని చూసుకుంటే మహేష్ బాబు ఎక్కువగా స్మోకింగ్ చేస్తూనే కనిపించాడు . ఈ క్రమంలోనే మహేష్ బాబుకి స్మోకింగ్ అంటే విపరీతమైన పిచ్చి ఉండే మనిషిల క్యారెక్టర్ డిజైన్ చేశారట .

సూపర్ స్టార్ లాంటి అంత పెద్ద హీరోకి అలాంటి జబ్బు క్రియేట్ చేసి సినిమాను తెరకెక్కించడం అంటే సాహసం అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయినాక మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక త్రివిక్రమ్ పరిస్థితి ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news