Moviesరతిక పై బిగ్ బాస్ కి ఎందుకంత ప్రేమ..? నాగార్జున కళ్లకి...

రతిక పై బిగ్ బాస్ కి ఎందుకంత ప్రేమ..? నాగార్జున కళ్లకి ఇవి కనిపించవా..?

రతిక ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ దక్కించుకుంటుంది . మరి ముఖ్యంగా గతంలో కొన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాక వచ్చింది. అయితే నాలుగు వారాలకు ఎలిమినేట్ అయిపోయిన రతిక మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

హైడ్రామాల మధ్య నెలకొన్న సస్పెన్షన్ తో రతిక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే . అయితే మొదటి నుంచి బిగ్ బాస్ రతిక విషయంలో కూసింత పాజిటివ్ గానే స్పందిస్తున్నారు . ఆమెను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి . నాగార్జున సైతం రతికను హౌస్ లో సపోర్ట్ చేస్తూ ఈసారి నామినేషన్ లో ఆమెను స్కిప్ చేశారు . హౌస్ లోకి వచ్చి ఒక్కరోజే అయింది అన్న కారణంగా ఆమెను నామినేషన్స్ నుంచి తప్పించారు.

అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో జరిగిన తప్పును అభిమానులు మరోసారి ప్రశ్నిస్తున్నారు . ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే సోమవారం నామినేషన్ లో వాళ్ళని నిల్చో పెట్టారు . మరి అప్పుడు ఏమైంది ఈ రూల్స్ అంటూ ప్రశ్నిస్తున్నారు . అంతేకాదు కొందరు రెచ్చిపోయి నాగార్జున రతిక అందాలకు టెంప్ట్ అయిపోయాడని ..హౌస్ లో ఆమెను చూడడానికి ఇలా డబల్ గేమ్స్ ఆడుతున్నారు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ కూడా ఇవన్నీ చూసి చూడనట్టు వెళ్లిపోవడం చాలా దారుణం అంటున్నారు ..ఎవరికో భయపడే రతికను హౌస్ లోకి పంపించి బిగ్బాస్ కి ఉన్న పరువు తీసేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news