Newsఒకే స్విమ్మింగ్ ఫూల్లో విజ‌య్ - స‌మంత‌... అడ్డంగా బుక్ అయ్యారుగా..!

ఒకే స్విమ్మింగ్ ఫూల్లో విజ‌య్ – స‌మంత‌… అడ్డంగా బుక్ అయ్యారుగా..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలిసిన నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. తాజాగా విడుదలైన ఖుషి సినిమా నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రొటీన్ స్టోరీ.. ముందుగానే ఊహించే సీన్లు.. కొంత లాగ్ ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉందని రివ్యూలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఖుషి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది.

రెండు రోజుల్లోనే ఏకంగా రు. 50 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అటు ఓవర్సీస్ లోను తొలి రోజుకే మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో ఎంతో కాలంగా హిట్టు కోసం పడిగాపులు పడిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సక్సెస్ కొట్టినట్టే అంటున్నారు. మరోవైపు శాకుంతలం లాంటి డిజాస్టర్ తర్వాత స‌మంత‌కు, ట‌క్ జగదీష్ లాంటి ప్లాపు త‌ర్వాత డైరెక్టర్ శివకు ఖుషి రూపంలో మంచి హిట్ ల‌భించింది.

ఇది ఇలా ఉంటే ఖుషి సినిమా ప్రమోషన్లు విభిన్నంగా జరుగుతున్నాయి. ఖుషి మ్యూజికల్ ఈవెంట్లో సమంత – విజయ్ స్టేజ్ మీద చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. ఖుషి మూవీ రిలీజ్ కి ముందు రోజు రాత్రి విజయ్ దేవరకొండ ఒక వీడియోతో ప్రమోషన్ చేశాడు. ఓ సిమ్మింగ్ పూల్ లో ఉన్న విజయ్ ఖుషి సినిమా రిలీజ్.. రెస్పాన్స్ గురించి మాట్లాడాడు. అయితే సమంత గురువారం రాత్రి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఒక ఫోటోలో ఆమె కూడా స్విమ్మింగ్ పూల్ లో దర్శనమిచ్చింది.

సమంత – విజయ్ దేవరకొండ ఉన్న స్విమ్మింగ్ పూల్ కాస్త ఒకేలా ఉండడంతో నెటిజ‌న్లు ఇద్దరు ఒకే చోట ఉన్నారా ? ఒకే స్విమ్మింగ్ పూల్ లో జలకాలాటలు ఆడుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలు పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ .. సమంతకు చాలా రోజుల తర్వాత మంచి హిట్ రావడంతో మీరు ఖుషి ఖుషి గా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news