Newsప్రభాస్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్‌చరణ్.....

ప్రభాస్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్‌చరణ్.. ఇంత‌కీ ఆ సినిమా ఇదే..!?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్ర‌స్తుతం వరుస‌ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాల తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న సరైన విజయం మాత్రం అందుకోలేక పోతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, కల్కి 2898AD , ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న సినిమా, స్పిరిట్ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో సలార్, కల్కి సినిమాలపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస‌ సినిమా షూటింగ్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ పాన్ ఇండియా హీరో.

అయితే ప్రభాస్ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు.. ఈ లిస్టులో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా మరి ఏదో కాదు ధృవ.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. 2015లో జ‌యంర‌వి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ అనే సినిమాకి ఇది రీమేక్ గా తెర‌కెక్కింది. రెండు భాషల్లోనూ ఒక‌ప్ప‌టి స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటించి మెప్పించాడు.

తెలుగులో 2016లో ధృవ విడుదలై ఘనవిజయంం సాధించింది. అదేవిధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీస్‌లీ సినిమాలతో వ‌రుస ప్లాప్‌ల‌తో ఇబ్బంది పడుతున్న సమయంలో ధృవ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే ఈ సినిమాని ముందుగా ప్రభాస్ తో చేయాల్సి ఉందట. కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా ధృవ కథను ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారట.

అలాగే ఒకరోజు ప్రభాస్‌ను కలిసి కథను కూడా చెప్పాడట. ప్రభాస్ యాక్షన్ మూవీ కాకుండా మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందంటూ చెప్పాడట సున్నితంగా మోహన్ రాజా చెప్పిన కథకెనో చెప్పాడట. దాంతో చేసేదేమీ లేక తన తమ్ముడు జయం రవితోనే కోలీవుడ్లో తని ఒరువన్ టైటిల్ తో మోహన్ రాజా ఈ సినిమా తెరకెక్కించారు. కోలీవుడ్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ నచ్చడంతో సురేందర్ రెడ్డి రామ్ చరణ్‌తో ధృవ టైటిల్ తో రీమేక్ చేశాడు. ఇక్క‌డ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ విధంగా ప్రభాస్ ఈ సినిమా చేసి ఉంటే ఆయన క్రేజ్ మరో లెవెల్ లో ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోహన్ రాజా ఇప్పుడు తని ఒరువన్ సినిమాకు సిక్వల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news