Newsలైవ్‌లో బ‌ట్ట‌లు విప్పేసి స‌మంత‌తో రొమాంటిక్ సీన్ చేసిన విజ‌య్‌... (...

లైవ్‌లో బ‌ట్ట‌లు విప్పేసి స‌మంత‌తో రొమాంటిక్ సీన్ చేసిన విజ‌య్‌… ( వీడియో )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎలాంటి కంటెంట్ తో సినిమాలు చేసిన తనదైన మార్క్ ప్రమోషన్లతో సినిమా మీద జనాల్లో అటెన్షన్ తీసుకురావటంలో దిట్ట అయిపోయాడు. అందుకే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. గత ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగ‌ర్ లాంటి భారీ డిజాస్టర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన విజయ్ ఈ ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.

సెప్టెంబర్ ఒకటిన విజయ్ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శివ నిర్వాణ‌ ఈ సినిమాకు దర్శకుడు. ముఖ్యంగా యూత్‌, లేడీస్ లో విజయ్ దేవరకొండకు ఉన్నంత ఫాలోయింగ్ ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలను కూడా లేదు అనటంలో సందేహం లేదు. ఇక ఖుషి టైలర్ కు ఇప్పటికే ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గతి రాత్రి హైదరాబాద్లో గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్లో యూనిట్ మొత్తంతో పాటు విజయ్ దేవరకొండ – సమంత కూడా పాల్గొన్నారు. సమంత నిన్న మొన్నటి వరకు కూడా విదేశీ వెకేషన్ లు ఎంజాయ్ చేస్తుంది. ఇక ఖుషి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల కోసం ఆమె మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. ఈరోజు జరిగిన లైవ్ ప్రోగ్రాం లో సమంత – విజయ్ చేసిన పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక రేంజ్ లో ఉపేస్తుంది.

విజ‌య్ ఏకంగా ష‌ర్ట్ విప్పేసి స‌మంత‌ను ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూ.. ఊపేస్తుంటే.. స‌మంత కూడా విజ‌య్ చేతుల్లో తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్న‌ట్టుగా ఉంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రు రొమాంటిక్‌గా కూడా కౌగిలించుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. విజ‌య్ త‌న సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ఇలా చేయ‌డం కామ‌న్‌. కానీ సౌత్‌లో స్టార్ హీరోలు అంద‌రితో క‌లిసి న‌టించిన స‌మంత ఇలా చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news