Newsసంగీత - ల‌య ఇద్ద‌రూ ఆ కార‌ణాల‌తోనే టాలీవుడ్‌లో ఫేడ‌వుట్ అయ్యారా..?

సంగీత – ల‌య ఇద్ద‌రూ ఆ కార‌ణాల‌తోనే టాలీవుడ్‌లో ఫేడ‌వుట్ అయ్యారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా సాంప్రదాయమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కొంతమంది ఉంటారు. అలాంటివారిలో తెలుగు అమ్మాయి లైలాతో పాటు సంగీత ఒకరు. సంగీత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సంగీతకు అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయిన ఆ తర్వాత ఆమె నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి.

దీంతో ఈమె ఇండస్ట్రీ నుంచి చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయింది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వ‌రు సినిమాలో హీరోయిన్ రష్మిక తల్లిగా.. మహేష్ బాబుకు అత్తగా సరికొత్త పాత్రలో సంగీత మెప్పించింది. ఆ తర్వాత చిరంజీవి ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించినా ఆ సినిమా ప్లాప్ అవడంతో ఆమెకు సరైన గుర్తింపు లేదు.

కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే సరైన కథలు.. సరైన హీరోలను ఎంపిక ? చేసుకోవడంలో సంగీత తప్పటడుగులు వేయడంతో ఆమె ఇండస్ట్రీ నుంచి త్వరగా ఫేడ్ అవుట్ అయింది. ఇక అచ్చ తెలుగు అమ్మాయి ల‌య కూడా వేణు హీరోగా ప‌రిచ‌యం అయిన స్వ‌యంవ‌రం సినిమాతో హీరోయిన్‌గా పరిచ‌యం అయ్యింది.

ఆ త‌ర్వాత మంచి ఛాన్సులు వ‌చ్చినా చాలా సినిమాలు ప్లాప్ అవ్వ‌డం.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండ‌డంతో కొంద‌రు స్టార్ హీరోలు, కొన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఆమెకు ఛాన్సులు రాలేదు. దీంతో ఆమె అమెరికాకు చెందిన ఓ డాక్ట‌ర్‌ను పెళ్లి చేసుకుని అక్క‌డే సెటిల్ అయిపోయింది. చాలా రోజుల త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా స‌క్సెస్ కాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news